Kaalamega Karigindhi : ‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ రిలీజ్.. స్కూల్ లవ్ స్టోరీ భలే ఉందే.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

పొయెటిక్ లవ్ స్టోరీగా రానున్న 'కాలమేగా కరిగింది' సినిమా..

Kaalamega Karigindhi Trailer Released

Kaalamega Karigindhi : వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కాలమేగా కరిగింది’. కలహాలే లేని ఓ ప్రేమకథ ట్యాగ్ లైన్. శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మాణంలో శింగర మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కితుంది.

Also See : ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ పదేళ్ల వేడుక.. వీడియో వైరల్.. నాని, విజయ్ ఫ్యాన్స్ కి పండగే..

పొయెటిక్ లవ్ స్టోరీగా రానున్న ‘కాలమేగా కరిగింది’ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఫణి, బిందు ఇద్దరు స్కూల్ డేస్ నుంచి ప్రేమికులు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఫణి మళ్ళీ స్కూల్ డేస్ వైపు ప్రయాణం సాగిస్తే ఏమైంది అని కవితాత్మకంగా చెప్పారు. సినిమా కుడా పూర్తిగా కవితలతో ప్రేమకథని చెప్తారని ట్రైలర్ చివర్లో తెలిపారు. మరి ఈ స్కూల్ లవ్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడాలి.