Second Single update from Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీల్లో హరిహర వీరమల్లు ఒకటి. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్రబృందం మొదలుపెట్టింది.
ఒక్కొ పాటను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలిని విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..
ఇక నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. కొల్లగొట్టినాదిరో అంటూ రెండో పాట పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పాటను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈపోస్టర్‌లో నిధి అగర్వాల్ ను పవన్ పొడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
Laila Twitter Review : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ట్విట్టర్ రివ్యూ..
Happy Valentine’s Day from #HariHaraVeeraMallu ❤️
Get ready to groove with the one and only Powerstar @PawanKalyan 🤩#HHVM 2nd single is coming to STEAL YOUR HEART! 🫶🏻#Kollagottinadhiro – #UdaaKeLeGayi – #EmmanasaParichutta – #KaddhukonduHodhalo – #EnManasuKattavale
Mark… pic.twitter.com/gU4GMBb68y
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 14, 2025
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు.