RRR : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఊహించని విధంగా అదిరిపోయే మాస్ సాంగ్

'ఆర్ఆర్ఆర్' చిత్రం నుండి రెండో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ నిన్న సాయంత్రం ఇచ్చారు. నవంబ‌ర్ 10న‌ 'నాటు నాటు...' అనే పాట‌ను విడుద‌ల

Rrr (1)

RRR : తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ‘బాహుబలి’తో రాజమౌళి క్రియేట్ చేసిన మానియా అలాంటిది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే మరో పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. జనవరి 7న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ గా ఈ సినిమాని తీర్చి దిద్దారు రాజమౌళి.

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, దోస్తీ సాంగ్ చూసి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అవన్నీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుండి రెండో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ నిన్న సాయంత్రం ఇచ్చారు. నవంబ‌ర్ 10న‌ ‘నాటు నాటు…’ అనే పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు చిత్ర బృందం. అయితే అప్ డేట్ తో పాటు ఓ పోస్టర్ ని కూడా విడుదల చేయగా ఆ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్ద‌రు హీరోలు ఆ పోస్టర్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ఆ పోస్టర్ చూసిన వాళ్ళు ‘ఆర్ఆర్ఆర్’లో ఇలాంటి సాంగ్, ఇలాంటి డ్రెస్సింగ్ ఉంటుందని ఊహించరు. సినిమా కథ చెప్పేదానికి ఈ పోస్టర్ కి చాల తేడా ఉంది. మరి రాజమౌళి కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియాలి అంటే సినిమా వచ్చేదాకా చూడాల్సిందే.