జయప్రకాష్ రెడ్డి హీరోగా ‘అలెగ్జాండర్’
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రలో ‘అలెగ్జాండర్’.. (ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం) అనే సినిమా రూపొందుతుంది..

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రలో ‘అలెగ్జాండర్’.. (ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం) అనే సినిమా రూపొందుతుంది..
నాటకరంగం నుండి చిత్ర పరిశ్రమకొచ్చి.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రకాష్ రెడ్డి.. విలనిజంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న జయప్రకాష్ రెడ్డి ఇప్పుడు హీరోగా మారారు.. ఆయన ప్రధాన పాత్రలో ‘అలెగ్జాండర్’ అనే సినిమా రూపొందుతుంది.
‘చైతన్యరథం’, ‘ఎర్రమల్లెలు’, ‘యువతరం కదలింది’, ‘ఎర్రమట్టి’ వంటి విప్లవాత్మక సినిమాలు చేసిన ధవళ సత్యం దర్శకత్వంలో, ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘అలెగ్జాండర్’.. (ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం) అనేది ట్యాగ్‌లైన్.. ఈ చిత్రంలో జయప్రకాశ్ రెడ్డి మాత్రమే నటించటం విశేషం.
Read Also : అరవ అర్జున్ రెడ్డి ‘ఆదిత్య వర్మ’ – ట్రైలర్
కొన్ని వందల చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న జయప్రకాశ్ రెడ్డి ఒకే పాత్ర ఉన్న చిత్రంలో హీరోగా నటించడం విశేషం. ‘అలెగ్జాండర్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.