Senior Actress Radhika Sarathkumar Shares emotional post on her Surgery
Radhika : సీనియర్ నటి రాధిక ఒకప్పుడు హీరోయిన్ గా మెప్పించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం తాను మోకాలి నొప్పులతో బాధపడుతున్నట్టు ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు తన మోకాలికి సర్జరీ అయిందని తెలుపుతూ నేడు ఉమెన్స్ డే రోజు ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
Also Read : Bunny Vasu : జెన్ Z జనరేషన్ పై ఆ విషయంలో నిర్మాత బన్నీ వాసు ఫైర్.. దయచేసి ఇలాంటి సినిమాపై కామెడీ చేయకండి..
రాధిక తన భర్తతో కలిసి హాస్పిటల్ లో దిగిన ఫోటోని షేర్ చేసి.. గత రెండు నెలలు చాలా బాధగా గడిచాయి. ఓ సినిమా షూటింగ్ లో నా మోకాలికి గాయం అయింది. హాస్పిటల్ కి వెళ్తే సర్జరీ చేయాలనీ చెప్పారు. కానీ నేను టాబ్లెట్స్ వాడాను. థెరపీలు చేయించుకున్నాను. మోకాలికి బ్రేస్ ధరించాను. ఆ నొప్పితోనే నేను సినిమా షూటింగ్స్ పూర్తిచేశాను. నా నొప్పి ఏ మాత్రం తగ్గకపోవడంతో చివరకు నేను సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ సమయంలో నా భర్త నన్ను చిన్నపిల్లలా చూసుకున్నాడు. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. ఈ మహిళా దినోత్సవం రోజు ప్రతి స్త్రీ తనపై దృష్టి పెట్టాలని, తనను తాను శక్తివంతం చేసుకునే పనిపై దృష్టి పెట్టాలని, మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలని నేను కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది.
ప్రస్తుతం రాధిక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుందని, ఇప్పుడిప్పుడే తన మోకాలి గాయం నుంచి కోలుకుంటుందని సమాచారం. రాధిక సర్జరీ చేయించుకుందని పోస్ట్ చేయడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు.