Bunny Vasu : జెన్ Z జనరేషన్ పై ఆ విషయంలో నిర్మాత బన్నీ వాసు ఫైర్.. దయచేసి ఇలాంటి సినిమాపై కామెడీ చేయకండి..

తాజగా నిర్మాత బన్నీ వాసు జెన్ Z పై ఫైర్ అయ్యాడు.

Bunny Vasu : జెన్ Z జనరేషన్ పై ఆ విషయంలో నిర్మాత బన్నీ వాసు ఫైర్.. దయచేసి ఇలాంటి సినిమాపై కామెడీ చేయకండి..

Producer Bunny Vasu Fires on Gen Z regarding Chhaava Movie

Updated On : March 8, 2025 / 9:06 PM IST

Bunny Vasu : ఇప్పుడున్న టీనేజ్, యూత్ ని జెన్ జీ అని పిలుస్తారని తెలిసిందే. ముందు జనరేషన్స్ కి వీళ్ళు చాలా దూరం, చాలా డిఫరెంట్. అంతా సోషల్ మీడియాలోనే బతికేస్తారు. అన్ని మీమ్ భాషల్లో కామెడిగానే చూస్తారు. దేన్ని ట్రోల్ చేయాలి, దేన్ని ట్రోల్ చేయకూడదు కూడా తెలీదు. తాజగా నిర్మాత బన్నీ వాసు జెన్ Z పై ఫైర్ అయ్యాడు.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథాంశంతో ఛావాని తెరకెక్కించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ‘ఛావా’ బాలీవుడ్ లో ఫిబ్రవరి 14న రిలీజయి భారీ విజయం సాధించగా తెలుగులో గీత్ ఆర్ట్స్ బన్నీ వాసు నిన్న మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజ్ చేసారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో నేడు సక్సెస్ మీట్ నిర్వహించారు.

Also Read : Chiranjeevi : అమ్మ నన్ను గుర్తుపట్టలేదు.. ఆ ఏజ్ లో నన్ను వెతుక్కుంటూ వచ్చి..

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. నిన్న నైట్ ఓ మల్టిప్లెక్స్ లో ఛావా సినిమా చూసి లిఫ్ట్ లో కిందకి వస్తున్నాను. లిఫ్ట్ లో చాలా మంది ఉండటంతో నన్ను అంతగా ఎవరూ పట్టించుకోలేదు. లిఫ్ట్ లో ఓ నలుగురు ఒక 19, 20 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు సినిమా చూసే వస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్స్ గురించి కామెడీ చేస్తున్నారు. ఆ పిల్లలకు హిస్టరీ తెలియకపోవచ్చు. నీకు సినిమా నచ్చడం, నచ్చకపోవడం వేరు. కానీ ఇలాంటి సినిమాల మీద కామెడీ చేయొద్దు. ఇది ఒక ఎమోషన్. ఇవాళ మన అందరం హ్యాపీ గా ఉన్నాం, స్వాతంత్య్రం వచ్చింది అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలను అర్పించారు కాబట్టే. కొన్ని చోట్ల డబ్బింగ్ బాగోలేదు అంటున్నారు. డబ్బింగ్ సినిమాల్లో డబ్బింగ్ సమస్య ప్రతి సినిమాకు ఉంటుంది. నేను నాలుగు రోజులు వదిలేసి ముంబైలో రాత్రి పగలు కూర్చొని ఈ సినిమాని తీసుకొచ్చాను. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని. ఇది ఒక మంచి సినిమా, మన పిల్లలకు చూపించాల్సిన చరిత్ర ఉన్న సినిమా. మా ముందు జనరేషన్ కి స్వతంత్రం విలువ అంటే ఏంటో తెలుసు. మాకు కొంత తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న యంగ్ జెన్ జీ జనరేషన్ కు ఫ్రీడమ్ విలువ తెలీదు. వాళ్ళ పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పిల్లలకు ఇలాంటి సినిమాలు చూపించండి. వాళ్లకు స్వతంత్రం విలువ, మన గురించి ప్రాణాలు అర్పించిన యోధుల గురించి తెలియాలి. ఆ లిఫ్ట్ లో వాళ్ళు అలా కామెడీగా మాట్లాడుతుంటే అప్పుడే ఏదో ఒకటి అందాం అనుకున్నా. కానీ మళ్ళీ ఎవరో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో వైరల్ అయి ఆ పిల్లల్ని ట్రోల్ చేయడం ఎందుకు అని ఆలోచించి ఆగిపోయాను. అలా మాట్లాడటం చాలా తప్పు. మీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదు అంతే. దీనిపై కామెడీ చేయకూడదు అంటూ ఫైర్ అయ్యారు.

దీంతో బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు నెటిజన్లు ఇలాంటి మంచి సినిమా, మన చరిత్ర చూపించే ఓ ఎమోషన్ సినిమాని అసలు వాళ్ళు ఎలా కామెడీ చేస్తారు, ఈ జనరేషన్ వాళ్లకి దేని మీద కామెడీ చేయాలో దేని మీద చేయకూడదో కూడా తెలియట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.