×
Ad

Nagarjuna-Tabu: నిన్నే పెళ్లాడుతా జోడీ మరోసారి.. నాగ్ 100వ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు.. అయితే ఈసారి..

అక్కినేని నాగార్జున తన 100 సినిమా కోసం (Nagarjuna-Tabu)సిద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా సైలెంట్ గా మొదలయ్యింది. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈ సినిమాను మొదలుపెట్టేశారు మేకర్స్.

Senior actress Tabu is playing the female lead in Nagarjuna's 100th film.

Nagarjuna-Tabu: అక్కినేని నాగార్జున తన 100 సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా సైలెంట్ గా మొదలయ్యింది. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈ సినిమాను మొదలుపెట్టేశారు మేకర్స్. రా. కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. అయితే, తన కెరీర్ లో 100వ సినిమా చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ (Nagarjuna-Tabu)చూసుకుంటున్నాడు నాగార్జున, అందుకే, ప్రతీ విషయాన్ని దగ్గరుండి తెలుసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

The Paradise: నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ ఎప్పుడంటే?

అదేంటంటే, యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో ఒకరు సీనియర్ నటి టబు కావడం విశేషం. నాగార్జున, టబు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. వాటిలో నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే అనే సినిమాలు ఉన్నాయి. అందులో, నిన్నే పెళ్లాడుతా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాగ్, టటబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆ టైంలో వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అనే రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ రేంజ్ లో స్క్రీన్ పై రెచ్చిపోయారు ఈ జంట.

ఆ తరువాత సిసింద్రీ సినిమాలో “ఆటాడుకుందాం రా..” అనే స్పెషల్ సాంగ్ కూడా చేశారు. ఈ సాంగ్ ఇప్పటికే వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి సూపర్ హిట్ జోడీ మరోసారి తెరపై కనిపించబోతున్నారు. దాంతో, ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. మరి చాలా కాలం తరువాత తెరపై కనిపించబోతున్న ఈ సూపర్ హిట్ జోడీ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటారు అనేది చూడాలి.