Balamurugan : తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ రచయిత కన్నుమూత..

తాజాగా సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు.................

Balamurugan : తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ రచయిత కన్నుమూత..

senior famous writer Balamurugan passes away

Updated On : January 16, 2023 / 7:53 AM IST

Balamurugan :  గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఇటీవలే పలువురు ప్రముఖుల్ని పోగొట్టుకొని సినీ పరిశ్రమ విషాదంలో ఉంది. తాజాగా సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు.

86 ఏళ్ళ వయసులో వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలమురుగన్ ఆదివారం నాడు మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా మీడియాకు వెల్లడించారు. తెలుగులో బాలమురుగన్ ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు, బంట్రోతు భార్య.. వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు. తెలుగులోనే అప్పట్లో దాదాపు 50 సినిమాల వరకు కథలు అందించారు.

RGV : కాకినాడ కోడిపందాల్లో ఆర్జీవీ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో మకాం..

ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పి శివాజీ గణేషన్ కి దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. అలాగే తమిళ్ లో దాదాపు 100 సినిమాలకి ఆయన కథలు అందించారు. అప్పుడున్న స్టార్ హీరోలందరితో కలిసి ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు భూపతి రాజా కూడా రచయితగా కొనసాగుతున్నాడు. సీనియర్ రచయిత బాలమురుగన్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.