Prerana Kambam
Prerana Kambam : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రేరణ కంభం ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొని మరింత వైరల్ అయింది. బిగ్ బాస్ లోకి వచ్చే ముందే తన పెళ్లి అయింది. తాజాగా ప్రేరణ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ స్టోరీ గురించి, తన లవ్ స్టోరీలో బ్రేకప్స్ గురించి చెప్పుకొచ్చింది.
ప్రేరణ తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. మాది ఆరేళ్ళ లవ్. నేను, శ్రీపద్ ఇద్దరం బిటెక్ లో క్లాస్మేట్స్. సెకండ్ ఇయర్ లో పరిచయం అయింది. థర్డ్ ఇయర్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా పెళ్లి అయి సంవత్సరంన్నర అవుతుంది. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు అని తెలిపింది.
Also Read : Chandra Barot : బాలీవుడ్ లో విషాదం.. అమితాబ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు కన్నుమూత..
అయితే వారి మధ్య జరిగిన బ్రేకప్ గురించి చెప్తూ.. యాక్టింగ్ మొదలయ్యాక ఒక సీరియల్ లో హీరోని బుగ్గ మీద ముద్దు పెట్టాలి. ఆ సీన్ చేశాను. శ్రీపాద్ అది చూసి బ్రేకప్ చెప్పాడు. అది తీసుకోలేకపోయాడు. ఆయనకు ఈ ఫీల్డ్ గురించి అంతగా తెలీదు. నా వర్క్ రెగ్యులర్ గా చూడడు, ఆ సీన్ చూసాడు. తన గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయికి ముద్దు పెట్టిందని తట్టుకోలేక బ్రేకప్ చెప్పాడు. కానీ నేను అది ఏం ఫీలింగ్ లేకుండానే పెట్టాను, అక్కడ గోడ ఉన్నా అలాగే ముద్దు పెడతాను, అది యాక్టింగ్ అని అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత అర్ధం చేసుకున్నాడు. ఇలా చిన్న చిన్న గొడవలు చాలా వచ్చాయి, బ్రేకప్స్ చెప్పుకున్నాం, మళ్ళీ కలిసిపోయాం అని తెలిపింది.
Also Read : CM Revanth Reddy : రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ భారీ నజరానా.. ఎంతంటే?