Chandra Barot : బాలీవుడ్ లో విషాదం.. అమితాబ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు కన్నుమూత..

అమితాబ్ కెరీర్ లో ఒక పెద్ద హిట్ సినిమాగా నిలిచింది.

Chandra Barot : బాలీవుడ్ లో విషాదం.. అమితాబ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు కన్నుమూత..

Chandra Barot

Updated On : July 20, 2025 / 1:12 PM IST

Chandra Barot : బాలీవుడ్ లో నేడు తీవ్ర విషాదం నెలకొంది. దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చంద్ర బారోట్ అమితాబ్ బచ్చన్ తో 1978 లో డాన్ సినిమా తెరకెక్కించారు. బాలీవుడ్ డాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అమితాబ్ కెరీర్ లో ఒక పెద్ద హిట్ సినిమాగా నిలిచింది.

ఇండియాలో ఆ తర్వాత వచ్చిన డాన్ సినిమాలకు చంద్ర బారోట్ తెరకెక్కించిన డాన్ సినిమానే ఒక పుస్తకంలా నిలిచింది. అప్పట్లోనే అమితాబ్ డాన్ సినిమా 7 కోట్లు కలెక్ట్ చేసింది. అమితాబ్ డాన్ తర్వాత బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ డాన్ టైటిల్ తో రెండు సినిమాలు తీసాడు. దానికి మరో సీక్వెల్ త్వరలో రణవీర్ సింగ్ హీరోగా రానుంది.

Also Read : CM Revanth Reddy : రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ భారీ నజరానా.. ఎంతంటే?

చంద్రబారోట్ డాన్ తర్వాత ఒక రెండు సినిమాలు తీసి కనుమరుగయ్యారు. సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. గత ఏడేళ్లుగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ 86 ఏళ్ళ వయసులో నేడు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయాన్ని చంద్ర బారోట్ భార్య దీప తెలిపారు. చంద్ర బారోట్ మృతిపై బాలీవుడ్ స్టార్స్ నివాళులు అర్పిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

 

Also Read : Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా? కొత్త సాంగ్ తో రిలీజ్..