Naveena : భర్తకి BMW కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీరియల్ నటి..

తెలుగు బుల్లితెర నటి నవీన సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. తాజాగా నవీన తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భర్తకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చింది. వీరి పెళ్లి రోజు సందర్భంగా నవీన తన...

Naveena : భర్తకి BMW కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీరియల్ నటి..

Naveena

Updated On : February 2, 2022 / 12:12 PM IST

 

Naveena :  తెలుగు బుల్లితెర నటి నవీన సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. సీరియల్స్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో వరుసగా వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఎక్కువ కొలాబరేషన్ వీడియోస్ ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ప్రొడక్స్ట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా నవీన సంపాదిస్తూ ఉంటుంది.

ఇటీవలే తన డ్రీం హౌస్ కూడా కట్టుకొని గృహప్రవేశం చేసుకుంది. ఈ గృహప్రవేశానికి లక్ష రూపాయల చీర కట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా నవీన తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భర్తకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చింది.

Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్

నవీన భర్త యాట సత్యనారాయణ ఫేమస్ సీరియల్ డైరెక్టర్. ఇప్పటికే ఈయన చాలా సీరియల్స్ ని తెరకెక్కించారు. త్వరలో వెబ్ సిరీస్ ని కూడా తెరకెక్కించబోతున్నారు. వీరి పెళ్లి రోజు సందర్భంగా నవీన తన భర్తకి BMW కారును గిఫ్ట్ గా ఇచ్చింది. కార్ కొన్న తర్వాత షోరూమ్‌లోనే కేక్‌ కట్‌ చేసి పెళ్లిరోజును సెలబ్రేట్‌ చేసుకుంది. ఆ తర్వాత కారుకు పూజ చేయించి నెక్లెస్‌ రోడ్‌లో మరోసారి కేక్‌ కట్‌ చేసి భర్తతో కలిసి వారి పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది.