Shah Rukh Khan Video: కూతురితో కలిసి షిర్డీ సాయిబాబా మందిరంలో షారుక్ ఖాన్ పూజలు

రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే.

Shah Rukh Khan

Shirdi Sai Baba Temple: ‘డంకీ’ సినిమా విడుదల నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇవాళ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో షారుక్‌తో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా ఉంది.

సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా ఆయన ఇలాగే వైష్ణోదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.

డ్రామా, రొమాన్స్ జాన‌ర్‌లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో నిర్మిస్తున్నారు.

హిరానీ, గౌరీ ఖాన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 21న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా డంకీ సినిమా విడుద‌ల కానుంది. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో డంకీ సినిమా రూపుదిద్దుకుంది.

Jigarthanda Double X : ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్’ మూవీని చూస్తాన‌న్న‌ దిగ్గ‌జ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. ఎందుకంటే..?