Jigarthanda Double X : ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్’ మూవీని చూస్తాన‌న్న‌ దిగ్గ‌జ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. ఎందుకంటే..?

Jigarthanda Double X - Karthik Subbaraj : విభిన్న‌మైన క‌థ‌ల‌ను తెర‌కెక్కించే కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’.

Jigarthanda Double X : ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్’ మూవీని చూస్తాన‌న్న‌ దిగ్గ‌జ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. ఎందుకంటే..?

Clint Eastwood reacts to fan asking him to watch Jigarthanda Double X

Updated On : December 14, 2023 / 7:51 PM IST

విభిన్న‌మైన క‌థ‌ల‌ను తెర‌కెక్కించే కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’. ఈ సినిమా ‘జిగర్‌ తండ’ కు సీక్వెల్‌గా తెర‌కెక్కింది. రాఘవ లారెన్స్, ఎస్‌.జే సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 10న రిలీజ్ కాగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమాని హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ చూడ‌నున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

డైరెక్ట‌ర్ కార్తీక్‌ సుబ్బ‌రాజ్ ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’ చిత్రాన్ని మీకు అంకిత‌మిచ్చాడు. మీకు వీలు కుదిరిన‌ప్పుడు ఈ సినిమాను ఓ సారి చూడాలంటూ ఓ నెటిజ‌న్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క్లింట్ ఈస్ట్‌వుడ్‌ను ట్యాగ్ చేశారు. ఈ సినిమా నెట్‌ఫిక్స్‌లో అందుబాటులో ఉన్న‌ట్లు చెప్పారు. ఈ ట్వీట్‌కు క్లింట్ ఈస్ట్‌వుడ్ రిప్లై ఇచ్చారు. తాను ఓ సినిమా షూటింగ్ బిజీగా ఉన్న‌ట్లు చెప్పారు. ఆ సినిమా పూర్తి అవ్వ‌గానే త‌ప్ప‌కుండా ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’ సినిమాను చూస్తానంటూ వెల్ల‌డించారు.

Star Anchors : అటు సిల్వర్ స్క్రీన్.. ఇటు టీవీ స్క్రీన్ .. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న స్టార్స్

ఈ విష‌యం తెలిసిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు కార్తీక్‌ సుబ్బరాజు మాట‌ల్లో చెప్ప‌లేనంత ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఇది తాను నిజంగా న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని చెప్పారు. ల‌క్ష‌లాది మంది భార‌తీయ అభిమానుల త‌రుపున ఈ సినిమాను క్లింట్ ఈస్ట్‌వుడ్‌కు అంకితం ఇచ్చాను. ఈ చిత్రాన్ని చూసిన త‌రువాత ఆయ‌న స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి అంటూ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు.

Guntur Kaaram : గుంటూరు కారం టీమ్‌పై నెటిజన్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి