Star Anchors : అటు సిల్వర్ స్క్రీన్.. ఇటు టీవీ స్క్రీన్ .. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న స్టార్స్
వెండితెర.. బుల్లితెర దేనిని వదిలిపెట్టడం లేదు కొందరు స్టార్స్.. తమ షోలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. నటులుగానే కాదు యాంకరింగ్‌లోను సత్తా చాటుతున్నారు. యాంకర్స్‌గా పేరు తెచ్చుకున్న ఆ స్టార్స్ గురించి చదవండి.

Star Anchors
Star Anchors : ఒకప్పుడు బుల్లితెరపై నటించే వారంతా వెండితెరపై వెలగాలని ఉవ్విళ్లూరేవారు. అవకాశాల కోసం పడిగాపులు కాసేవారు. ఇప్పుడంతా సీన్ రివర్స్. టాప్ హీరోలంతా సినిమాలు చేస్తూనే టెలివిజన్ స్క్రీన్‌కి కూడా స్పేస్ ఇస్తున్నారు. తమ హోస్టింగ్‌తో సత్తా చాటుతున్నారు. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ నటుల నుండి మంచు మనోజ్, విశ్వక్ సేన్ వంటి నటులు సైతం బుల్లితెరపై సంచలనం రేపుతున్నారు. బుల్లితెరను ఏలుతున్న ఆ స్టార్స్ గురించి చదవండి.
నాగార్జున : తెలుగు బిస్ బాస్‌కి బ్రాండ్‌గా మారిపోయారు కింగ్ నాగార్జున. ఆయన తప్ప ఆ షోని మరొకరు సరిగా హోస్ట్ చేయలేరన్నంత ఇమేజ్ సంపాదించుకున్నారు. మొత్తం 7 సీజన్లలో 5 సీజన్లకు హోస్ట్ చేసారాయన. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను సైతం నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు.
Guntur Kaaram : గుంటూరు కారం టీమ్‌పై నెటిజన్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి
బాలకృష్ణ : బాలకృష్ణను తెరపై యాక్షన్ హీరోగా చూసిన ప్రేక్షకులు ఆయన హోస్ట్‌గా వస్తున్నారంటే ఆశ్చర్యపోయారు. మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై యాంకర్‌గా మారిన బాలకృష్ణ అందని అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ తో అదర గొట్టారు. దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ఈ షో మూడవ సీజన్ అదే జోష్ లో సాగిపోతోంది.
చిరంజీవి : తన నటన, డ్యాన్స్‌తో అలరించిన మెగాస్టార్ బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి యాంకర్ అవతారం ఎత్తారు. కానీ ఇది అనుకున్నంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత ఆయన ఏ షో హోస్ట్ చేయలేదు.
Year End Roundup 2023 : ఫ్యాన్స్‌కు నిరాశ.. 2023లో థియేటర్లలో కనపడని తెలుగు హీరోలు
జూనియర్ ఎన్టీఆర్ : అటు వెండితెరపై నటనతో విశ్వరూపం చూపించే జూనియర్ ఎన్టీఆర్ టెలివిజన్ స్క్రీన్‌పై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మొదటి హోస్ట్‌గా వ్యవహరించారు. బిగ్ బాస్ మొదటి సీజన్ కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో బిజీవల్ల ఏ షోకి హోస్ట్ చేయలేదు.
నాని : నేచురల్ స్టార్ నాని కూడా యాంకర్‌గా కనిపించారు. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేశారు నాని. అది అనుకున్నంతగా హిట్ కాకపోవడం.. దానికి తోడూ అనేక విమర్శలు రావడం జరిగింది. సీజన్ 3 కి కూడా నానినే హోస్ట్ చేస్తారని వార్తలు వినిపించినా ఆయన చేయలేదు.
Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు
మంచు మనోజ్ : చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరమైన మంచు వారబ్బాయి మంచు మనోజ్ యాంకర్‌గా ఎంట్రీ ఇస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘ఉస్తాడ్ .. ర్యాంప్ ఆడిద్దాం’ అనే గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. డిసెంబర్ 15 నుండి ఈ షో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ షో టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. హీరోగా అవకాశాలు రాకనో.. లేక బుల్లితెరపై సత్తాను చాటుకునేందుకో మనోజ్ ఈ దారిని ఎంచుకున్నారు.
విశ్వక్ సేన్ : ఆహాలో ఫ్యామిలీ ధమాకా షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఓ వైపు సినిమాలు, మరోవైపు గేమ్ షో చేస్తూ రెండువైపులా బిజీ అయ్యారు. రెగ్యులర్ టీవీ హోస్ట్‌లకు గట్టి పోటీ ఇస్తున్నారు.
రానా : రానా గతంలో ‘నెంబర్ వన్ యారీ’ అనే షో హోస్ట్ చేశారు. ఈ షో బాగానే పాపులర్ అయ్యింది. టాప్ స్టార్స్‌తో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో రానా చేసిన హోస్టింగ్ అందర్నీ ఆకట్టుకుంది. త్వరలో రానా కూడా మరో కొత్త షోతో ముందుకు రావచ్చని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు వీరిని చూసి ఇన్‌స్పైర్ అయిన మరికొంతమంది స్టార్స్ కూడా ఇదే బాటపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇక భవిష్యత్తులో అటు వెండితెర, ఇటు బుల్లితెరను పెద్ద స్టార్లు ఏలేస్తారనడంతో సందేహం లేదు. ఇక వీరి పోటీకి బుల్లితెర యాంకర్లు ఎలా తట్టుకుంటారో చూడాలి.