Shah Rukh Khan : ట్యాక్స్ పేమెంట్.. టాప్ ప్లేస్‌లో బాలీవుడ్ బాద్ షా.. కోహ్లీ ఎంత పన్ను కడుతున్నాడంటే?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్‌లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు.

Shah Rukh Khan beats Virat Kohli as Indias biggest tax paying celebrity
Shah Rukh Khan -Virat Kohli : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్‌లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి షారుఖ్ ఖాన్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టాడు. అదే సమయంలో కోహ్లీ రూ.66 కోట్లను ట్యాక్స్‌గా చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫార్చూన్ ఇండియా ప్రకారం భారత దేశ సెలబ్రిటీలలో అత్యధిక ట్యాక్స్ కట్టింది షారుఖ్ ఖాన్.
ఆ తరువాతి స్థానాల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రూ.80 కోట్లు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. నాలుగో స్థానంలో రూ.71కోట్లతో అమితాబ్ బచ్చన్ ఉండగా ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నట్లుగా తెలిపింది. అజయ్ దేవగణ్, ఎంఎస్ ధోని, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ లు టాప్-10లో ఉన్నారు.
HIT 3 : ‘హిట్-3’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. అర్జున్ సర్కార్‌ను చూశారా..?
అత్యధిక పన్ను చెల్లించే టాప్-20 సెలబ్రిటీలు..
* షారుక్ ఖాన్ – రూ. 92 కోట్లు
* కోలీవుడ్ హీరో విజయ్ – రూ. 80 కోట్లు
* సల్మాన్ ఖాన్ – రూ. 75 కోట్లు
* అమితాబ్ బచన్ – రూ. 71 కోట్లు
* విరాట్ కోహ్లి – రూ. 66 కోట్లు
*అజయ్ దేవగన్ – రూ. 42 కోట్లు
*ఎంఎస్ ధోనీ – రూ. 38 కోట్లు
*రణబీర్ కపూర్ – రూ. 36 కోట్లు
*సచిన్ టెండూల్కర్ – రూ. 28 కోట్లు
*హృతిక్ రోషన్ – రూ. 28 కోట్లు
*కపిల్ శర్మ – రూ. 26 కోట్లు
MS Dhoni : విజయ్ ‘ది గోట్’ మూవీలో ధోని.. ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లుతున్న థియేటర్లు!
*సౌరవ్ గంగూలీ- రూ. 23 కోట్లు
*కరీనా కపూర్ – రూ. 20 కోట్లు
*షాహిద్ కపూర్ – రూ. 14 కోట్లు
*మోహన్‌లాల్ – రూ. 14 కోట్లు
*అల్లు అర్జున్ – రూ. 14 కోట్లు
*హార్దిక్ పాండ్య – రూ. 13 కోట్లు
*కియారా అద్వానీ – రూ. 12 కోట్లు
*కత్రినా కైఫ్ – రూ. 11 కోట్లు
*పంకజ్ త్రిపాఠి- రూ. 11 కోట్లు
*అమీర్ ఖాన్ – రూ. 10 కోట్లు
*రిషభ్ పంత్ – రూ. 10 కోట్లు