Shah Rukh Khan Comments on Ram Charan
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కి వస్తున్న పాపులారిటీ, రోజురోజుకి పెరుగుతున్న క్రేజ్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కి పాన్ ఇండియా వైడ్ తో పాటు గ్లోబల్ వైడ్ ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. ఆన్‌స్క్రీన్ లోనే కాదు అఫ్‌స్క్రీన్‌లో కూడా తన స్టైలింగ్ అండ్ మేక్ ఓవర్ తో అందర్నీ ఆకట్టుకుంటూ యూత్ కి ఐకాన్ గా నిలుస్తున్నాడు.
Ram Charan : తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఆనందంలో చిరు..
ఇక చరణ్ డెడికేషన్ చూసిన తారలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ గురించి కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన షారుఖ్‌ని ఒక అభిమాని చరణ్ గురించి ఒక మాట చెప్పమన్నాడు. దానికి షారుఖ్ బదులిస్తూ.. “చరణ్ నా ఓల్డ్ ఫ్రెండ్. మా పిల్లలకి తన అంటే చాలా ఇష్టం” అంటూ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. RC15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్ వంటి నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
He is an old friend and very loving to my kids https://t.co/LlLU9lHM0T
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2022