Shah Rukh Khan : తను కొన్న కార్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. షారుఖ్, దీపికాలపై కేసు నమోదు..

రాజస్థాన్ కి చెందిన లాయర్ తను కొన్న కార్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ పై కేసు నమోదు చేసింది.(Shah Rukh Khan)

Shah Rukh Khan

Shah Rukh Khan : తాజాగా రాజస్థాన్ కి చెందిన ఓ లాయర్ తను కొన్న కార్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కంపెనీ వాటిని సాల్వ్ చేయట్లేదని ఆ కంపెనీతో పాటు, ఆ కంపెనీ కార్ ని ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ పై కేసు నమోదు చేసింది.(Shah Rukh Khan)

వివరాల్లోకి వెళితే..

Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..

రాజస్థాన్ భరత్ పూర్ కి చెందిన లాయర్ కృతి సింగ్ 2022 లో 23 లక్షలు పెట్టి హ్యుందాయ్ ఆల్కేజర్ SUV కార్ ని కొనుక్కుంది. కార్ కొన్న కొన్ని నెలలకే కార్ లో అనేక సమస్యలు వచ్చాయి. కంపెనీకి చెప్పినా ఆ సమస్యలు సాల్వ్ చేయకపోగా పట్టించుకోలేదు కూడా.

దీంతో కృతి సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా వాళ్ళు కేసు తీసుకోకపోవడంతో కోర్టుకెళ్లింది. కృతి సింగ్ పిటిషన్ విచారించిన కోర్ట్ దానికి సంబంధించిన సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : OG Song : పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది.. మంచి మెలోడీ పాట..

అయితే కృతి సింగ్ తన ఫిర్యాదులో హ్యుందాయ్ మోటార్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్స్ MD అంసో కిమ్, COO తరుణ్ గార్గ్, తనకు కార్ అమ్మిన మాల్వా ఆటో సేల్స్ MD నితిన్ శర్మ, డైరెక్టర్ ప్రియాంక శర్మలతో పాటు ఇలాంటి సమస్యలు ఉన్న ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసినందుకు, అలంటి బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉన్నందుకు షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ లపై కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. మరి దీనిపై హ్యుందాయ్ కంపెనీ, షారుఖ్, దీపికాలు ఎలా స్పందిస్తారో చూడాలి.