OG Song : పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది.. మంచి మెలోడీ పాట..

తాజాగా నేడు వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ OG సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు. (OG Song)

OG Song : పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది.. మంచి మెలోడీ పాట..

OG Song

Updated On : August 27, 2025 / 10:19 AM IST

OG Song : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో OG సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో OG సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, ఒక సాంగ్, పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.(OG Song)

తాజాగా నేడు వినాయకచవితి సందర్భంగా OG సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సినిమా 90s బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ కథ కావడంతో పాట కూడా అప్పటి పాట లాగే మెలోడీగా మెప్పించింది. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో శృతి రంజని పాడింది. ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ పై ప్రేమ సాంగ్ లా చిత్రీకరించారు.

Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..

మీరు కూడా ఈ పాటను వినేయండి..

ఇక OG సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజవ్వనుంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ 200 కోట్లకు జరిగిందని సమాచారం.