Shah Rukh Khan : ఢిల్లీ యువతి అంజలి కుటుంబానికి షారుఖ్ సాయం..

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్.. సినిమాలో కింగ్ కాంగ్ అనిపించుకోవడమే కాదు, బయట కూడా తన గొప్ప మనసుని చాటుకొని రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతి యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన షారుఖ్ ఖాన్ మనసుని కూడా కలచివేసింది. దీంతో అంజలి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.

Shah Rukh Khan helps Delhi accident girl anjali's family

Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్.. సినిమాలో కింగ్ కాంగ్ అనిపించుకోవడమే కాదు, బయట కూడా తన గొప్ప మనసుని చాటుకొని రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతి యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ అంజలి వర్క్ కంప్లీట్ చేసుకొని బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో నాలుగు యువకులు ర్యాష్ డ్రైవింగ్ తో ఆమెను ఢీ కొట్టారు. ఆమె కాలు కారు చక్రంలో చిక్కుకోగా, 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకు వెళ్లడంతో ఆమె మరణించింది.

Shah Rukh Khan : నెటిజెన్లు కామెంట్స్ కౌంటర్లు ఇస్తున్న షారుఖ్ ఖాన్..

న్యూ ఇయర్ రోజు జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. తండ్రి లేని అంజలి.. తానే కుటుంబాన్ని చూసుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబానికి ఏ దిక్కు లేకుండా పోయింది. ఇక ఈ సంఘటన షారుఖ్ ఖాన్ మనసుని కూడా కలచివేసింది. దీంతో అంజలి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తన మీర్ ఫౌండేషన్ ద్వారా అంజలి తల్లికి డబ్బుని అందజేయబోతున్నట్లు ప్రకటించాడు.

అయితే ఎంత ఆర్ధిక సాయం చేస్తున్నాడు అనేది చెప్పలేదు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు.. తమ హీరో రియల్ బాద్‌షా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ‘పఠాన్’ సినిమా కోసం చేస్తున్న సింపథీ పనులు అంటూ వాపోతున్నారు. కాగా షారుఖ్ నటించిన పఠాన్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేయవద్దు అంటూ థియేటర్ మేనేజ్‌మెంట్‌కి పలు సంఘాలు వార్నింగ్ లు ఇస్తున్నారు.