Shah Rukh Khan : నెటిజెన్లు కామెంట్స్ కౌంటర్లు ఇస్తున్న షారుఖ్ ఖాన్..

బాలీవుడ్‌లో ఏ మూవీ ఎదురుకొని వ్యతిరేకతను ‘పఠాన్’ సినిమా ఎదురుకుంటుంది. షారుఖ్ ఖాన్ మాత్రం సినిమాని సాధ్యమైనంత వరకు ఆడియన్స్ కి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో Q&A నిర్వహిస్తున్నాడు. దీంతో ఒక నెటిజెన్..

Shah Rukh Khan : నెటిజెన్లు కామెంట్స్ కౌంటర్లు ఇస్తున్న షారుఖ్ ఖాన్..

Shah Rukh Khan counters to netizens comments

Shah Rukh Khan : బాలీవుడ్‌లో ఏ మూవీ ఎదురుకొని వ్యతిరేకతను ‘పఠాన్’ సినిమా ఎదురుకుంటుంది. కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ నటించిన ఈ స్పై యాక్షన్ చిత్రంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘బేషరం రంగ్’ సాంగ్ తో మొదలైన ఈ వివాదం రోజురోజుకి పెద్దది అవుతూ వెళుతుంది. తాజాగా దీనిపై భజరంగ్ ధాల్ నిరసన తెలియజేస్తూ గుజరాత్ థియేటర్‌లోని పఠాన్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.

Pathaan : గుజరాత్‌లో పఠాన్ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన భజరంగ్ ధాల్..

అయితే షారుఖ్ ఖాన్ మాత్రం సినిమాని సాధ్యమైనంత వరకు ఆడియన్స్ కి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో Q&A నిర్వహిస్తున్నాడు. దీంతో ఒక నెటిజెన్.. ‘ఇప్పటికే పఠాన్ డిజాస్టర్ అయ్యింది. మీరు ఇంక రిటైర్‌మెంట్ తీసుకోండి’ అంటూ విమర్శిస్తూ కామెంట్ చేశాడు. దానికి షారుఖ్.. ‘బెటా పెద్ద వాళ్లతో అలా మాట్లాడకూడదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఇక మరో నెటిజెన్.. మీరు కాశ్మీర్ కి చెందిన ముస్లిం కదా? మరి మీ పేరు వెనుక ఖాన్ అని ఎందుకు ఉంది? అంటూ క్యూస్షన్ చేయగా, షారుఖ్ బదులిస్తూ.. ‘ఈ ప్రపంచం మొత్తం నా కుటుంబమే. కుటుంబం బట్టి మనకి పేరు రాదు. మనం చేసే పనులు బట్టి మనకి పేరు, గౌరవం వస్తుంది. ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాకండి’ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్‌గా మారాయి.