గేమ్‌ఛేంజర్ మూవీ క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. టీజర్.. సినిమా మీద అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. ట్రిపులార్ తర్వాత రాంచరణ్‌కు పాన్‌ఇండియా లెవల్‌లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది. దీన్ని డబుల్ చేసేలా.. గేమ్‌చేంజర్ మూవీ టీమ్ భారీ ప్లాన్ చేసిందట. చెర్రీ కోసం షారుఖ్ రంగంలోకి దిగబోతున్నాడట. ఇంతకీ ఎందుకు.. ఏం చేయబోతున్నారు?
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీపై… అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయ్. ఈ మూవీ వెయ్యి కోట్ల వరకు వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో మూవీ టీమ్ కనిపిస్తోంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన టీజర్.. అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
ట్రిపులార్‌తో రాంచరణ్‌కు బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దీంతో అక్కడి మార్కెట్‌పై గేమ్ ఛేంజర్ టీమ్ కన్నేసింది. దానికి తగినట్లు ప్రమోషన్స్ ప్రారంభించింది. టీజర్‌ను లక్నోలో రిలీజ్ చేసింది కూడా అందుకే. ఐతే గేమ్‌చేంజర్ మూవీకి సంబంధించి.. ఇప్పుడో క్రేజీ న్యూస్.. సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. చెర్రీ కోసం షారుఖ్ రంగంలోకి దిగబోతున్నాడట.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను.. బాలీవుడ్‌లో గ్రాండ్‌గా జరపాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఘనంగానే ప్లాన్ చేస్తోంది. నార్త్‌లో ప్రమోషన్స్ గట్టిగా చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఉత్తరాదిలో కనీసం నాలుగు ఈవెంట్‌లు కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఐతే ఇందులో ఫస్ట్ ఈవెంట్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్.. చీఫ్ గెస్ట్‌గా వస్తారనే ప్రచారం జరుగుతోంది. గేమ్‌ఛేంజర్ మూవీని హిందీలో ఎక్కువమందికి చేరువచేయాలంటే.. షారుఖ్ ఖాన్‌లాంటి స్టార్ హీరో రావాలని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ హిందీ రైట్స్ బిజినెస్ భారీగా జరగాలంటే.. షారుఖ్ రావాలన్నది చాలామంది ఒపీనియన్. ఐతే ఇప్పటికే షారుఖ్‌ను రాంచరణ్ కలిసినట్లు తెలుస్తోంది.
మూవీ రిలీజ్ అయ్యేలోపు బాలీవుడ్‌లో భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. బాలీవుడ్ మీడియాతో చిట్‌చాట్‌లు నిర్వహించడంతో పాటు… విడుదలకు ఇంకా సమయం ఉండటంతో అక్కడ మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిన్న ఆర్జీవీ.. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి.. అరెస్టుల పర్వంలో నెక్ట్స్ జరగబోయేదేంటి?