Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ దగ్గరుంటే సేఫ్‌గా ఉంటుంది – దీపికా

తొలి సినిమాలోనే షారూఖ్ ఖాన్‌తో ఫరా ఖాన్ డైరక్షన్ లో ఎంట్రీ కొట్టేసింది దీపికా పదుకొన్. ఓం శాంతి ఓం సినిమా తర్వాత హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ లతో మళ్లీ.. మళ్లీ జతకట్టి....

Shah Rukh Khan: తొలి సినిమాలోనే షారూఖ్ ఖాన్‌తో ఫరా ఖాన్ డైరక్షన్ లో ఎంట్రీ కొట్టేసింది దీపికా పదుకొన్. ఓం శాంతి ఓం సినిమా తర్వాత హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ లతో మళ్లీ.. మళ్లీ జతకట్టి హిట్‌లు కొట్టేసింది. ఇప్పుడు మరోసారి పఠాన్ ప్రాజెక్టుతో షారూఖ్ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్ పంచుకునేందుకు రెడీ అయిపోయింది.

ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారూఖ్ ఖాన్‌తో ఉంటే తనకు సేఫ్‌గా ఉంటుందని చెప్పింది. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం దక్కడం చాలా గొప్పగా ఫీలవుతున్నానని చెప్పింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసేసుకున్న సినిమా యూనిట్ చివరి షెడ్యూల్ ప్లానింగ్‌లో ఉంది.

Sharukh Khan Inside

Sharukh Khan

‘కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే ఉంది. కానీ, ఆయనతో కలిసి పనిచేయడం గొప్పగా ఫీలవుతా. ఇంట్లో ఉన్నట్లే అనుకుంటా. సేఫ్ గా ఉంటుంది. అతనితో ఉంటే సెక్యూర్ గా అనిపిస్తుంది. పఠాన్ డైరక్టర్ కూడా అంతే. గతంలోనూ ఆయనతో కలిసి పని చేశా. డైరక్టర్‌గా కంటే ఎక్కువ పరిచయం ఉంది. SRKతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికైనా రెడీగా ఉన్నా’ అని చెప్తుంది దీపికా.

Read Also: మల్టీ టాస్కింగ్ దీపికా.. ఏ అవకాశాన్నీ వదలుకొనేదేలేదు!

దీపికా చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన గెహ్రాయియాన్ తో పాటు ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్‌తో, ప్రభాస్‌తో, మధు మంతెనతో, అమితాబ్ బచ్చన్‌తో ప్రాజెక్టులకు సంతకం చేసేసింది.