Deepika Padukone: మల్టీ టాస్కింగ్ దీపికా.. ఏ అవకాశాన్నీ వదలుకొనేదేలేదు!

దీపికా పదుకోన్.. అన్ డౌటెడ్ లీ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అయితే అంత ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోలేదు. సినిమా సినిమా సినిమా అంటూ సినిమా జపం చేస్తోంది. సినిమాకు సంబందించి తన ప్రేమను..

Deepika Padukone: మల్టీ టాస్కింగ్ దీపికా.. ఏ అవకాశాన్నీ వదలుకొనేదేలేదు!

Deepika Padukone

Deepika Padukone: దీపికా పదుకోన్.. అన్ డౌటెడ్ లీ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అయితే అంత ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోలేదు. సినిమా సినిమా సినిమా అంటూ సినిమా జపం చేస్తోంది. సినిమాకు సంబందించి తన ప్రేమను ప్రతి సారీ ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ఎక్స్ పెక్ట్ చెయ్యని క్యారెక్టర్లతో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ.. డిఫరెంట్ క్యారెక్టర్ లతో ఎంటర్ టైన్ చేస్తోంది. అంతేకాదు సినిమా లవర్ గా తన ప్రొడక్షన్ లో డిఫరెంట్ సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తోంది.

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

దీపికా పడుకోన్ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉంది. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు విమెన్ ఓరియంటెడ్, హిస్టారికల్ మూవీస్ తో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లే కాదు.. అంతకన్నా బిజీగా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. 5 సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అటు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా డిఫరెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడానికి రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ 83 సినిమాని ప్రొడ్యూస్ చేసిన దీపిక.. ఇప్పుడు తన తండ్రి జీవితాన్ని తెరమీదకి తీసుకురావాలనుకుంటోంది.

Deepika Padukone : ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై దీపికా పదుకునే వ్యాఖ్యలు

దీపికా పదుకోన్.. తన తండ్రి ప్రకాష్ పదుకోన్ లైఫ్ స్టోరీని తెరమీదకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. తన సొంత నిర్మాణ సంస్త.. కా ప్రొడక్షన్ లో ప్రకాష్ పదుకోన్ సినిమా చెయ్యడానికి పనుల్ స్పీడప్ చేసింది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలవకముందే ఇండియాని వరల్డ్ ఛాంపియన్ గా నిలిపిన తన తండ్రి జీవితాన్ని తెరమీదకి తీసుకురాబోతోంది దీపికా.1981 లోనే ప్రకాష్ పదుకోన్.. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించి ఇండియాని టాప్ లో నిలబెట్టారు. దీపికా తండ్రి ప్రకాష్ పదుకోన్.. స్టార్ బ్మాడ్మింటన్ ప్లేయర్.. దీపికా కూడా సినిమాల్లో కంటే ముందు నేషనల్ లెవల్లో బ్యాండ్మిటన్ ని రిప్రజంట్ చేసింది.

Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!

దీపికా స్టార్ హీరోయిన్ గా వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. లేటెస్ట్ గా గెహరాయియా అనే ఇంట్రస్టింగ్ మూవీ చేసింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో దీపికా తన యాక్టింగ్ ని ఎక్స్ ట్రార్డినరీ లెవల్లో చూపించింది. ఒక వైపు నెగెటివ్ ట్రోలింగ్ ఉన్నా కూడా సినిమాకి కావల్సిన ఎలిమెంట్స్ ని కంప్లీట్ గా ఇచ్చేస్తుంది. అంత పర్ ఫెక్ట్ గా సినిమాకి తన కమిట్ మెంట్ ఇస్తుంది దీపికా.

Deepika Ranveer: సోషల్ మీడియా సాక్షిగా రణ్వీర్‌ను తెగపొగిడేసిన దీపికా!

దీపికా సినిమా ట్రూలవర్. అందుకే సినిమాకు సంబంధించి ప్రతి యాస్పెక్ట్ నీ ఎంజాయ్ చేస్తుంది. అద్బుతమైన సినిమాలతో అంతకంటే అందమైన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. ఒక వైపు కమర్షియల్ కంటెంట్ తో పాటు.. మరో వైపు ఇన్ స్పైరింగ్ మూవీస్ చేస్తోంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ ని పోట్రే చేసే ఏ అవకాశాన్నీ వదలుకోదు దీపికా. విమెన్ సెంట్రిక్ సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తూనే.. షారూఖ్, హృతిక్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ చేస్తోంది. తన కెరీర్ ని ఏదో ఒక ఇమేజ్ కి పరిమితం చెయ్యకుండా సినిమాకు సంబంధించి ప్రతి రోల్ నీ పర్ ఫెక్ట్ గా చేస్తూ.. ప్రొడ్యూసర్ గా కూడా మల్టీటాస్కింగ్ చేస్తోంది దీపికా పదుకోన్.