Shah Rukh Khan: ఆదిపురుష్ రికార్డుల దగ్గరకు కూడా వెళ్లలేకపోయిన షారుక్ పఠాన్ మూవీ..
బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". సిద్ధార్థ ఆనంద్ తరికెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నేడు షారుక్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. కాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన 53 నిమిషాలకు గాను...

Shah Rukh Khan Pathan Movie Trailer Didn't Touch the Adipurush Teaser Records
Shah Rukh Khan: బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం “పఠాన్”. సిద్ధార్థ ఆనంద్ తరికెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. నేడు షారుక్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో నిండిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.
Prabhas: ప్రాజెక్ట్-K సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడా?
ఇక విషయానికి వస్తే ఈ మూవీ ట్రైలర్ విడుదలైన 53 నిమిషాలకు గాను 200K లైక్స్ ని దక్కించుకుంది. అయితే ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ కేవలం 18 నిమిషాల్లోనే ఈ ఫీట్ ని సాధించింది. నెగిటివ్ టాక్ వచ్చిన టీచర్ రికార్డులను కూడా అందుకోలేకపోవడంతో.. బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ కూడా ప్రభాస్ మానియా ముందు నిలవలేకపోయాడంటూ సోషల్ మీడియాలో డార్లింగ్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఆదిపురుష్ సంక్రాంతికి కానుకగా విడుదల కాబోతున్నట్లు మూవీ టీం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్ లోని VFX వర్క్ పై భారీగా ట్రోలింగ్ జరగడంతో.. మూవీ టీం మరికొంత సమయం తీసుకుని వాటిని సరిచేసి పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలుపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లువడలేదు.