Shahrukh Khan : కూతురితో కలిసి నటించబోతున్న షారుఖ్..??
పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో షారుఖ్ ఖాన్ మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్‌ని కూడా నటింపచేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట.

Shahrukh Khan and his daughter suhana khan acting together for a movie
Suhana Khan : చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం షారుఖ్‌వి రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయిందని, షారుఖ్‌కి కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్‌ని కూడా నటింపచేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట. సుహానా కూడా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. షారుఖ్ కూతురిగా ఆల్రెడీ సుహానా బాలీవుడ్ లో చాలా పాపులర్. ఇక సోషల్ మీడియాలో తన ఫొటోలు, పోస్టులతో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవలే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఓ బ్యూటీ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఇక సుహానా నటితున్న మొదటి సినిమా ది ఆర్చీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే సుహానాకు మంచి స్టార్‌డం ఉంది.
తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటించబోయే సినిమాలో సుహానా ఖాన్‌కి కూడా ఓ ముఖ్య పాత్ర ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే సుహానాకి ఇంకా కథ చెప్పినట్టు, ఆమె నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం లేదు. అయితే ఈ వార్త తెలియడంతో తండ్రి కూతుళ్లు కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.