Shahrukh Khan : అయిదేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా లేదు.. అయినా వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ 4 షారుఖ్..

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ దగ్గరినుంచి 5 ఏళ్లుగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ స్టార్ డమ్ విషయంలో మాత్రమే కాదు, సంపద విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు షారూఖ్ ఖాన్. టామ్ క్రూజ్, డ్వైన్ జాన్సన్ లాంటి హాలీవుడ్ స్టార్ హీరోల్ని మించి ఇన్ కమ్ విషయంలో మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.......................

Shahrukh Khan : అయిదేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా లేదు.. అయినా వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ 4 షారుఖ్..

Shahrukh Khan is the top 4th in world richest actors

Updated On : January 13, 2023 / 5:07 PM IST

Shahrukh Khan :  టామ్ క్రూజ్ , జాకీ చాన్, జార్జ్ క్లూనీ..హాలీవుడ్ తోప్ స్టార్ హీరోలు, ఎంత పెద్ద టాప్ హీరోలైనా.. ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినా.. మన షారూఖ్ ఖాన్ తర్వాతే వీళ్లందరూ. వరల్డ్ వైడ్ గా వీళ్లకు ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత క్రేజ్ ఉన్నా, బాలీవుడ్ బాద్ షా తర్వాతే వీళ్ల లైన్. వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్నా, రెమ్యూనరేషన్ తో, కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా ఈ హాలీవుడ్ హీరోల్ని ఒకే ఒక్క విషయంలో పడగొట్టేశాడు షారూఖ్.

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ దగ్గరినుంచి 5 ఏళ్లుగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ స్టార్ డమ్ విషయంలో మాత్రమే కాదు, సంపద విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు షారూఖ్ ఖాన్. టామ్ క్రూజ్, డ్వైన్ జాన్సన్ లాంటి హాలీవుడ్ స్టార్ హీరోల్ని మించి ఇన్ కమ్ విషయంలో మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సినిమాల ద్వారా నయా పైసా ఇన్ కమ్ లేదు. కానీ హాలీవుడ్ హీరోల్ని మించి వరల్డ్ స్టాటిస్టిక్స్ లో ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన నటుల్లో టాప్ 4 గా తన ప్లేస్ పదిలం చేసుకున్నారు షారూఖ్ ఖాన్.

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఇన్ కమ్ విషయంలో, ప్రాపర్టీ విషయంలో హాలీవుడ్ టాప్ స్టార్స్ తో పోటీపడుతున్నారు. తాజాగా 770 మిలియన్ డాలర్లు అక్షరాలా 6300కోట్లకు పైగా సంపదతో రిచెస్ట్ యాక్టర్ గా ప్రపంచంలోనే ఫోర్త్ ప్లేస్ సంపాదించుకున్నారు షారూఖ్ ఖాన్. హాలీవుడ్ నుంచి చాలా మంది టాప్ రిచెస్ట్ యాక్టర్స్ పోటీపడినా షారూఖ్ ఖాన్ మాత్రం నాల్గవ స్తానంలో నిలిచి రికార్డ్ క్రియేట్ చేశారు.

షారూఖ్ ఖాన్ పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ ఉన్న యాక్టర్. షారూఖ్ ఖాన్ నిజానికి 5 ఏళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. అయినా సరే వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ హాలీవుడ్ యాక్టర్స్ ని సైతం వెనక్కి నెట్టారు. వరల్డ్స్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో అమెరికన్ కమెడియన్ జెర్రీ సీన్ ఫెల్డ్ 1 బిలియన్.. అక్షరాలా 800 కోట్ల రూపాయలతో ఫస్ట్ ప్లేస్ లోఉన్నారు. టైలర్ పెర్రీ కూడా 1 బిలియన్ డాలర్స్ తో సెకండ్ ప్లేస్ లోఉన్నారు. ఇక ద రాక్ డ్వైన్ జాన్సన్.. 6,500 కోట్ల రూపాయలతో థర్డ్ ప్లేస్ దక్కించుకుంటే షారూఖ్ ఖాన్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇక హాలీవుడ్ సూపర్ హ్యాండ్సమ్ హీరో టామ్ క్రూజ్ 5 వేల కోట్ల రూపాయలతో టాప్ 5 రిచెస్ట్ యాక్టర్ గా నిలిచారు. మార్షల్ ఆర్ట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న జాకీ చాన్ 4 వేలకోట్ల రూపాయలతో ఆరోస్థానం, జార్జ్ క్లూనీ కూడా 4 వేలకోట్ల సంపదతో సెవెన్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇలా టాప్ హాలీవుడ్ హీరోల్ని వెనక్కి నెట్టి షారూఖ్ ఫోర్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు.

షారూఖ్ ఖాన్ షారూఖ్ ఖాన్ సినిమాల ద్వారానే కాదు, రకరకాల ఎండార్స్ మెంట్లతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్కెట్, బైజూస్ యాప్, బాత్రూమ్ ఎసెన్షియల్స్, పెయింట్స్, కార్స్ , బ్యాంక్స్ ..ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ లో ఉన్న బ్రాండ్స్ కి కమర్షియల్ గా ప్రమోషన్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా ఫుల్ గా సంపాదిస్తున్నారు షారూఖ్. షారూఖ్ ప్రస్తుతం దాదాపు 14 బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ ఎండార్స్ మెంట్స్ ద్వారానే కాదు తన ప్రొడక్షన్ హౌజ్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో కూడా మనీ జనరేట్ చేస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం షారూఖ్ ఖాన్ యావరేజ్ యాన్యువల్ ఇన్ కమ్ కనీసం 300కోట్లకు పైనే ఉంటుందని అంచనా. 2019 వరకూ టాప్ 13లో ఉన్న షారూఖ్ ఖాన్ 2019 తర్వాత సిక్స్త్ ప్లేస్ లోకి షిఫ్ట్ అయిపోయారు.

షారూఖ్ ఖాన్ కి సినిమాలు, బ్రాండింగ్ తో పాటు స్పోర్ట్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ పేరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లలో ఓ టీమ్ ని ఓన్ చేసుకున్నారు షారూఖ్. వీటితో పాటు వెస్ట్ ఇండీస్ డొమెస్టిక్ టీ 20లో టి అండ్ టి నైట్ రైడర్స్ పేరుతో టీమ్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తూ ఆస్తులని కూడబెట్టి ఏకంగా హాలీవుడ్ యాక్టర్స్ ని దాటి మరీ వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో టాప్ 4 గా నిలబడ్డాడు.

Largo Winch : ‘వారసుడు’తో సహా చాలా సినిమాలకి ఈ సినిమానే ఇన్స్పిరేషన్..

5 ఏళ్ల నుంచి సినిమాలు చెయ్యని షారూఖ్ ఇప్పుడు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మరో 2 వారాల్లో పఠాన్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్న షారూఖ్ ఖాన్, ఈ ఇయర్ మిడ్ లోనే జవాన్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరో మూవీ డంకీ ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వందల కోట్ల మార్కెట్, అంతకుమించి కోట్ల మంది క్రేజ్ తో షారూఖ్ ఖాన్ అన్ డౌటెడ్ లీ రిచెస్ట్ పర్సన్ గానే కంటిన్యూ అవుతారంటున్నారు ఆయన ఫాన్స్.