షారుఖ్ సినిమాల లైనప్ మామూలుగా లేదుగా..

ShahRukh Khan: కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చానాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చిన్న విరామం తర్వాత ఇటీవల ‘వార్’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ రైటర్ కమ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ‘పఠాన్’ సినిమాను పట్టాలెక్కించాడు. దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రాజా రాణి, పోలీసోడు (తెరి), అదిరింది (మెర్సల్), విజిల్ (బిగిల్) సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీతో ‘సంకి’ అనే సినిమా చేయబోతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
మున్నాభాయ్ M.B.B.S, 3 ఇడియట్స్, పీకే, సంజు సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణితో కలిసి ఫస్ట్ టైం పనిచేయబోతున్నాడు కింగ్ ఖాన్.. రాజ్‌కుమార్, షారుఖ్ ఇమేజ్‌కి తగ్గట్టు, తన మార్క్ మిస్ కాకుండా ఓ స్టోరీ రెడీ చేసి వినిపించగా.. బాద్‌షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
బాలీవుడ్‌లో రచన, దర్శకత్వ విభాగాల్లో సత్తా చాటుతూ.. ఇటీవల ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన రాజ్ &డికె (రాజ్ నిడుమోరు, కృష్ణ డికె) కలయికలోనూ ఓ సినిమా చేయనున్నాడు షారుఖ్. వరుస పరాజయాలతో డీలా పడ్డా.. సరికొత్త కథలతో క్రేజీ కాంబినేషన్స్‌తో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు షారుఖ్ ఖాన్.