‘పరాన్నజీవి’ ఫస్ట్‌లుక్.. ఆర్జీవీగా షకలక శంకర్..

ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య సినిమాల రూపంలో పోటీ క్రియేట్ అయ్యింది. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. వర్మ ‘పవర్‌స్టార్’ ట్రైలర్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పవన్ అభిమానులు నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్‌కు సపోర్ట్‌గా రూపొందుతోన్న చిత్రం ‘పరాన్నజీవి’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో రామ్ గోపాల్ వర్మ ప్రధాన పాత్రధారిగా కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఆర్జీవీపై వీరు.కె దర్శకత్వంలో ‘డేరా బాబా’(దీరా బాబా) అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లోనూ ఆర్జీవీ పాత్రలో షకలక శంకర్ నటిస్తున్నాడు. అంటే రామ్ గోపాల్ వర్మ పాత్రలో అటు వెబ్ సిరీస్, ఇటు సినిమాలోనూ షకలక శంకరే నటిస్తుండటం గమనార్హం. ఇంతకు ముందు వర్మ ముందే వర్మలా స్కిట్ చేసి మెప్పించాడు శంకర్.