Aadi Saikumar : ‘శంబాలా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. సైకిల్ తొక్కుతున్న ఆది సాయి కుమార్..

నేడు ఆది సాయి కుమార్ పుట్టిన రోజు కావడంతో శంబాల సినిమా నుంచి హీరో ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Aadi Saikumar : ‘శంబాలా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. సైకిల్ తొక్కుతున్న ఆది సాయి కుమార్..

Shambala Movie First Look Released on Aadi Sai Kumar Birthday

Updated On : December 23, 2024 / 10:39 PM IST

Aadi Saikumar : సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా డిఫరెంట్ సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయి కుమార్. ప్రస్తుతం ఆది చేతిలో ఓ మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఆది సాయి కుమార్ హీరోగా శంబాల అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఆది సాయి కుమార్ పుట్టిన రోజు కావడంతో శంబాల సినిమా నుంచి హీరో ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే హీరో సైకిల్ మీద మంటల్లోంచి వస్తున్నట్టు ఏదో యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన సీన్ అని తెలుస్తుంది. ఇందులో ఆది పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ శంబాల సినిమాను ‘ఏ’ యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తుండగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ పోలీసులు నోటీసులు.. ఆ రోజు బన్నీతో వచ్చిన వ్యక్తిగత సిబ్బందిపై ఆరా తీయనున్న పోలీసులు..

ఇటీవల శంబాల సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించబోతున్నారు. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 

హాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ తో కలిసి పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక నేడు అది సాయి కుమార్ పుట్టిన రోజు కావడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఈ హీరోకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : Pushpa 2 : ఓ వైపు అల్లు అర్జున్ వివాదం.. అయినా మరోవైపు పుష్ప 2 రికార్డులు.. లేటెస్ట్ రికార్డ్ ఏంటో తెలుసా?