×
Ad

Christmas Movies: క్రిస్మస్ సినిమాల కలెక్షన్ డీటెయిల్స్.. టాప్ లో ఆ సినిమానే.. అస్సలు ఉహిచలేదుగా..

క్రిస్మస్ అనేది సినిమా(Christmas Movies) పరిశ్రమకు మంచి సీజన్ గా చెప్పుకుంటారు. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి, ఈ సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు చాలా మంది మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

Shambhala, Champion, Esha and Dhandoraa movie first day collection

Christmas Movies: క్రిస్మస్ అనేది సినిమా పరిశ్రమకు మంచి సీజన్ గా చెప్పుకుంటారు. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి, ఈ సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు చాలా మంది మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే 2025 క్రిస్మస్(Christmas Movies) సీజన్ లో వరుసగా సినిమాలు విడుదల అయ్యింది. అయితే, లిస్టులో పెద్ద సినిమాలు ఏవీ లేకపోడంతో చిన్న సినిమాలు పండుగ చేసుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఈ సీజన్ లో ఏకంగా 4 సినిమాలు విడుదల అయ్యాయి. అవే దండోరా, ఛాంపియన్, ఈషా, శంబాలా. మరి ఏ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Thanuja: అందరూ కళ్యాణ్.. కళ్యాణ్ అంటున్నారు.. లైవ్ లో మనసులో మాట చెప్పేసిన తనూజ

* ముందుగా రోషన్ మేక నటించిన ఛాంపియన్ గురించి చెప్పాలంటే.. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాతో ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కించాడు. కథ కాస్త పాతదే అయినా దానిని నడిపించిన తీరు బాగుండటంతో ఆడియన్స్ ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ ఇచ్చారు. దాంతో, ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.4.50 కోట్ల వసూళ్లు రాబట్టింది.

* ఇక ఆది సాయి కుమార్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేకలు ఆయన శంబాలా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. కథ, కథనం కూడా కొత్తగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.3 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

* ఇక ఈషా సినిమా విషయానికి వస్తే ఈ సీజన్ లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ హారర్ జానర్ సినిమా ఇది. సినిమాలో కథ, కథనం చాలా గ్రిప్పింగ్ గా ఉండటం, చాలా సీన్స్ కి వెన్నులో వణుకుపుట్టించేలా ఉండటంతో ఆడియన్స్ ఒక రేంజ్ లో తథ్రిల్ ఫీల్ అవుతున్నారు. అలాగే చాలా కాలం తరువాత టాలీవుడ్ లో వచ్చిన హారర్ సినిమా కావడంతో ఈషా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈషా సినిమాకు మొదటి రోజు రూ.2.50 కోట్ల వసూళ్లు రాబట్టింది.

* ఇక దండోరా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా కూడా కొంతమంది ఆడియన్స్ ని మెప్పించింది. కానీ, రొటీన్ గా ఫీలవుతున్నారు చాలా మంది. అందుకే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది. అందుకే ఈ సినిమా మొదటిరోజు కోటి రూపాయల వరకు రెవెన్యూ చేసింది అని తెలుస్తోంది. మొత్తానికి క్రిస్మస్ సినిమాలు అన్నీ మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.