Thanuja: అందరూ కళ్యాణ్.. కళ్యాణ్ అంటున్నారు.. లైవ్ లో మనసులో మాట చెప్పేసిన తనూజ

బిగ్ బాస్ సీజన్ 9 ముగిశాక తనూజ(Thanuja) సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో కాసెపు ముచ్చటించింది. ఈ లైవ్ సెషన్ లో చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది.

Thanuja: అందరూ కళ్యాణ్.. కళ్యాణ్ అంటున్నారు.. లైవ్ లో మనసులో మాట చెప్పేసిన తనూజ

Tanuja made interesting comments about her friendship with Kalyan Pada.

Updated On : December 26, 2025 / 2:01 PM IST

Thanuja: బిగ్ బాస్ సీజన్ 9 ఈమధ్యే ముగిసింది. ఈ కొత్త సీజన్ కి కామనర్ గా వచ్చిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒక కామనర్ గా వచ్చి ఈ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాకుండా విన్నర్ గా కూడా నిలవడం అనేది మాములు విషయం కాదు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ సీజన్ 9 ముందు నుంచి టైటిల్ ఫేవరేట్ ఎవరు అంటే చాలా మంది సీరియల్ నటి తనూజ పేరు చెప్పారు. సీజన్ ముందుకు నడుస్తున్న కొద్దీ అందరు ఫిక్స్ అయ్యారు కూడా. తనూజనే విన్నర్ అని. కానీ, అనూహ్యంగా టాప్ లోకి కళ్యాణ్ పడాల వచ్చాడు.

Ram Gopal Varma: వెంటాడుతున్న ‘దురంధర్’ కుక్క.. వణుకు పుట్టించింది.. రామ్ గోపాల్ వర్మ సంచనల పోస్ట్..

అయితే.. విన్నర్, రన్నర్ అయినా తనూజ(Thanuja)-కళ్యాణ్ మధ్య హౌస్ లో ఉన్నప్పుడు చాలా క్యూట్ రిలేషన్ నడిచింది. ఒకసారి ప్రేమగా, ఒకసారి కోపంగా ఉండేవారు. చిన్న చిన్నవాటికి చిన్న చిన్న గొడవలు పడటం, ఇద్దరిఅలకలు, బిజ్జగింపులు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఒకానొక సందర్భంలో తనూజకు ప్రపోజ్ చేసినంత పెనిచేశాడు కళ్యాణ్. అందుకే, వీరి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అందుకే, ఈ ఇద్దరు ఎక్కడ కనిపించిన అదే ప్రశ్నను వేశారు. బిగ్ బాస్ స్టేజి మీద, బిగ్ బాస్ బజ్ లో ఇలా ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే ప్రశ్నలు. అలాగే ఇద్దరు కూడా చాలా ఓపికగా సమాదానాలు చెప్పుకుంటూ వచ్చారు.

అయితే, మరోసారి తనూజకు అదే ప్రశ్న ఎదురయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9 ముగిశాక తనూజ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో కాసెపు ముచ్చటించింది. ఈ లైవ్ సెషన్ లో చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది. అయితే, ఒక నెటిజన్ మాత్రం మరోసారి తనూజ-కళ్యాణ్ రిలేషన్ గురించి అడిగాడు. దానికి సమాధానంగా తనూజ మాట్లాడుతూ..”మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను ఈ ప్రశ్నకి ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పేశాను. కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. హౌస్ లో అదే ఉంది. ఇకముందు కూడా అదే ఉంటుంది. అంతకుమించి ఎం లేదు. అంటూ తన మనసులో మాటను చెప్పేసింది తనూజ. దీంతో, ఈ ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.