Game Changer : RC15 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.. శంకర్ ‘గేమ్ చేంజ్’ చేస్తున్నాడా?

రామ్ చరణ్ (Ram Charan) శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా శంకర్ భారతీయుడు-2 కోసం రామ్ చరణ్ సినిమా రిలీజ్ ని పోస్ట్‌పోన్..

Game Changer : RC15 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.. శంకర్ ‘గేమ్ చేంజ్’ చేస్తున్నాడా?

Shankar postpone Game Changer movie for Indian 2

Updated On : March 28, 2023 / 4:58 PM IST

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) RRR సినిమా తరువాత చేస్తున్న సినిమా RC15. నిన్న (మార్చి 27) చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. గేమ్ చెంజర్ (Game Changer) అనే ఇంగ్లీష్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ ఈ మూవీతో పాటు మరో సినిమాని కూడా ఏకకాలంలో డైరెక్ట్ చేస్తున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో 2019లోనే భారతీయుడు సీక్వెల్ ని ( Indian 2) ప్రారంభించాడు.

Chiranjeevi : RRR టీంకి చిరు ఘన సన్మానం..

అయితే కొన్ని కారణాలు వల్ల ఈ సినిమా షూటింగ్ గతంలో నిలిచి పోయింది. ఇంతలో శంకర్ రామ్ చరణ్ మూవీ స్టార్ట్ చేశాడు. ఆ తరువాత భారతీయుడు-2 మళ్ళీ పట్టాలు ఎక్కడంతో ఆ మూవీని కూడా ఏకకాలంలో షూట్ చేస్తున్నాడు. కాగా చరణ్ సినిమా కంటే కమల్ హాసన్ సినిమానే ముందు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే శంకర్ తెలియజేశాడు. భారతీయుడు-2 ని డిసెంబర్ లో, గేమ్ చెంజర్ ని జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే నిన్న రిలీజ్ చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎక్కడ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది.

Ram Charan : రామ్‌‍చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా చేసిన ఉపాసన.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్..

2024 జనవరికి భారతీయుడు-2 ని, ఏప్రిల్ లో గేమ్ చెంజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మహేష్ బాబు, ప్రభాస్ తమ సినిమాలతో ప్లేస్ కన్‌ఫార్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ శంకర్ గేమ్ చేంజ్ చేసిన వార్తలు నిజమైతే రామ్ చరణ్ సినిమా కోసం మరో ఏడాది ఎదురు చూడాల్సిందే. ఇప్పటికే RRR రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యిపోయింది.