శంకర్ దర్శకత్వంలో డార్లింగ్ ‘ధూమ్ 4’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ కలయికలో ‘ధూమ్ 4’ తెరకెక్కనుందనే వార్త వైరల్‌గా మారింది..

  • Published By: sekhar ,Published On : December 10, 2019 / 10:16 AM IST
శంకర్ దర్శకత్వంలో డార్లింగ్ ‘ధూమ్ 4’

Updated On : December 10, 2019 / 10:16 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ కలయికలో ‘ధూమ్ 4’ తెరకెక్కనుందనే వార్త వైరల్‌గా మారింది..

“ఎవరో పుట్టించనిదే మాటలెలా పుడతాయి అన్నట్టు ఎవరో ఒకరు పుట్టించనిదే పుకార్లు మాత్రం ఎలా పుడతాయి” అన్నచందాన సినిమా పరిశ్రమలో ప్రతిరోజూ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ప్రస్తుతం కొత్త రూమర్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ కలయికలో ‘ధూమ్ 4’ తెరకెక్కనుందనేది సదరు రూమర్ యొక్క సారాంశం.

Image result for prabhas shankar movie

‘బాహుబ‌లి’తో ఇంటర్నేష‌న‌ల్ స్థాయిలో ఇమేజ్‌ను సంపాదించుకున్న ప్ర‌భాస్‌తో సినిమాలు చేయాల‌ని బాలీవుడ్ సంస్థ‌లు స‌హా మిగతా పరిశక్రమల వారు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూడా ప్ర‌భాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్‌తో ‘ఇండియ‌న్ 2’ సినిమా చేస్తున్న ఆయ‌న త‌దుప‌రి ప్ర‌భాస్‌తో సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు మరి.

అయితే శంక‌ర్ త‌న తర్వాతి సినిమాను దళపతి విజ‌య్‌తోనే చేస్తాడ‌ని తమిళ తంబీలు అంటున్నారు. మ‌రి నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.