Shantala Movie : నాట్య కళ, మహిళా సాధికారికతపై ‘శాంతల’ సినిమా.. స్పెషల్ ప్రివ్యూ చూసి ఫస్ట్ రివ్యూ చెప్పిన వెంకయ్య నాయుడు..

ప్రమోషన్స్ లో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు(Venkayya Nayudu) శాంతల సినిమాని స్పెషల్ ప్రివ్యూ వేశారు. వెంకయ్య నాయుడు సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

Shantala Movie : నాట్య కళ, మహిళా సాధికారికతపై ‘శాంతల’ సినిమా.. స్పెషల్ ప్రివ్యూ చూసి ఫస్ట్ రివ్యూ చెప్పిన వెంకయ్య నాయుడు..

Shantala Movie First Review by Venkayya Naidu

Updated On : November 11, 2023 / 3:44 PM IST

Shantala Movie : ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతకం పై కె ఎస్ రామారావు గారి సమర్పణలో ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ ధాన పాత్ర లో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియాడిక్ చిత్రం శాంతల. ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ కాపీ పూర్తవ్వడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు(Venkayya Nayudu) శాంతల సినిమాని స్పెషల్ ప్రివ్యూ వేశారు. వెంకయ్య నాయుడు సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాంతల చిత్రం ప్రివ్యూని వీక్షించాను. అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యంలో నిర్మించిన చిత్రం ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. కొత్త నటీనటులైనప్పటికీ అద్భుతంగా నటించారు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఈ సినిమా జాతీయ అవార్డులు సాధించగలదని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాని తీసినందుకు దర్శకుడు శేషును అభినందిస్తున్నాను అని అన్నారు.

Also Read : Niharika New Movie Opening : నిర్మాతగా నిహారిక కొత్త సినిమా ప్రారంభం.. పూజా కార్యక్రమం ఫొటోలు..

ఇటీవల శాంతల సినిమా సాంగ్స్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున రిలీజ్ చేశారు. కళాత్మక సినిమాగా శాంతలని తెరకెక్కించారు. ఈ సినిమాకు సీతారామం సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. నవంబర్ 24న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో శాంతల విడుదల కానుంది.