96 తెలుగు రీమేక్‌లో – శర్వానంద్, సమంత

96 తెలుగు రీమేక్‌లో మొదటిసారి కలిసి నటించబోతున్న శర్వానంద్, సమంత.

  • Published By: sekhar ,Published On : January 26, 2019 / 07:11 AM IST
96 తెలుగు రీమేక్‌లో – శర్వానంద్, సమంత

96 తెలుగు రీమేక్‌లో మొదటిసారి కలిసి నటించబోతున్న శర్వానంద్, సమంత.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రస్తుతం, బయోపిక్‌‌ల ట్రెండ్‌తో పాటు, రీమేక్‌ల హవా కూడా కొనసాగుతుంది. 2018లో తమిళ్‌లో ఘన విజయం సాధించిన సినిమా 96. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి చాలా రోజుల క్రితమే రైట్స్ కొన్న దిల్ రాజు, సరైన జోడీ దొరక్క వెయిట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్, నాని పేర్లు కూడా వినబడ్డాయి. ఎట్టకేలకు 96 తెలుగు రీమేక్‌కి హీరో, హీరోయిన్స్ దొరికేసారు. యంగ్ హీరో శర్వానంద్, సమంత ఈ రీమేక్‌లో నటించబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. శర్వా, సమంత కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి.

శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 34గా రూపొందబోయే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్, ఈ రీమేక్‌ని కూడా డైరెక్ట్ చెయ్యనున్నాడు. తమిళ 96లో విజయ్ సేతుపతి, త్రిషల కెమిస్ట్రీకీ, యాక్టింగ్‌కీ మంచి పేరు వచ్చింది. పలు అవార్డులు కూడా 96 దక్కించుకుంది. ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకున్న 96 తెలుగు రీమేక్ షూటింగ్ మార్చ్‌లో ప్రారంభం కానుంది.

 వాచ్ 96 ట్రైలర్…