×
Ad

Sharwanand : ఆ సినిమాల్లో నన్ను చూసి నాకే ఛీ అనిపించింది.. ఆ యాక్సిడెంట్ తర్వాత.. శర్వానంద్ కామెంట్స్ వైరల్..

నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ అనంతరం శర్వానంద్ మీడియాతో మాట్లాడారు.(Sharwanand)

Sharwanand

Sharwanand : కొత్త కొత్త కథలతో, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు శర్వానంద్. గత కొన్నాళ్లుగా కొత్తగా ప్రయత్నించినా, ఫ్యామిలీ, కమర్షియల్ సినిమాలు ట్రై చేసినా శర్వానంద్ కి వర్కౌట్ అవ్వలేదు. ఇటీవల సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో సడెన్ గా వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రేక్షకులని ఫుల్ గా నవ్విస్తుంది.(Sharwanand)

నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ అనంతరం శర్వానంద్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తన పాత సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Pawan- Charan: ఫ్యాన్స్ కి మెగా ట్రీట్.. అబ్బాయ్ తో బాబాయ్ మూవీ.. రంగం సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్

శర్వానంద్ మాట్లాడుతూ.. జాను సమయంలో నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టింది. అసలు చెయ్యి అయితే రాదు అన్నారు. అప్పుడు బాగా లావు అయిపోయాను. ఆ తర్వాత చేసిన శ్రీకారం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాల్లో లావుగా కనిపించాను. ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే అందులో నన్ను చూస్తుంటే నాకే ఛీ అనిపించింది. నేను అలా ఎలా చేసాను, నన్ను చూసి టికెట్లు ఎలా తెగుతాయి అని అనిపించింది.

అందుకే ఆ సినిమాల తర్వాత నా బాడీ మీద ఫోకస్ చేశాను. ఎక్సర్సైజులు, యోగా అండ్ డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి వెయిట్ తగ్గాను. ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాలో నా లుక్స్, స్టైలింగ్ గురించి అంతా మాట్లాడుతున్నారు. నేను సన్నగా అయి నా బాడీ మీద ఫోకస్ చేశాను కాబట్టే అందరికి నచ్చుతుంది. నా నెక్స్ట్ సినిమా బైకర్ కోసం ఇంకా ఎక్కువ కష్టపడ్డాను అని తెలిపారు.

Also See : Lavanya Tripati: భర్త బర్త్ డేకి స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య.. ఫొటోలు