Pawan- Charan: ఫ్యాన్స్ కి మెగా ట్రీట్.. అబ్బాయ్ తో బాబాయ్ మూవీ.. రంగం సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Pawan- Charan) తో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Pawan- Charan: ఫ్యాన్స్ కి మెగా ట్రీట్.. అబ్బాయ్ తో బాబాయ్ మూవీ.. రంగం సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్

pawan kalyan doing a movie with ram charan

Updated On : January 20, 2026 / 9:48 AM IST
  • రామ్ చరణ్ తో నిర్మాతగా పవన్ కళ్యాణ్ మూవీ
  • దర్శకుడిగా త్రివిక్రమ్
  • త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Pawan- Charan: మెగా ఫ్యాన్స్ కి బాబాయ్(పవన్ కళ్యాణ్)- అబ్బాయ్(రామ్ చరణ్) ల బాండింగ్ అనేది చాలా ఎమోషన్. ఈ ఇద్దరూ ఏ సినిమా వేదికపై కనిపించినా ఒకరి గురించి ఒకరిని మాట్లాడమని అరుస్తూ ఉంటారు ఫ్యాన్స్. అంతేకాదు, ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలనేది కూడా వారి కోరిక. ఇక పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా ఒకరిపట్ల ఒకరి చాలా ప్రేమగా ఉంటారు.

ఇక తన బాబాయ్ గురించి చెప్తూ రామ్ చరణ్ కూడా గర్వాంగా ఫీలవుతూ ఉంటాడు. అయితే, ఇంతకాలం తరువాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్(Pawan- Charan) తమ ఫ్యాన్స్ కోరిక తీర్చబోతున్నారా అంటే నిజమేననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారట. అవును, ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Akshay Kumar: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ కారుకి ప్రమాదం

అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ ఇటీవల తన స్వంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక నుంచి తన బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే మొదటి సినిమాను అబ్బాయ్ రామ్ చరణ్ తో చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ఇందుకోసం తన చిరకాల మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ సహాయం కోరాడట. రామ్ చరణ్ తో తాను చేయబోయే సినిమా కోసం అద్భుతమైన కథను సెట్ చేయాలనీ కోరాడట.

అందుకు, త్రివిక్రమ్ కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. దీంతో, ఎట్టకేలకు రామ్ చరణ్- త్రివిక్రమ్ కాంబో సెట్ అయ్యింది అంటూ ఫ్యాన్స్ నుంచి పాజిటీవ్ కామెంట్స్ వినిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం. అలాగే, ఈ ప్రాజెక్టులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కూడా భాగస్వామ్యం కానుంది అని సమాచారం. ఇక సుకుమార్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్- రామ్ చరణ్ మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ న్యూస్ తెలిసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.