Maa Election
Maa Election: మా (MAA) ఎన్నికల వివాదం ఒకవైపు రచ్చ కొనసాగుతుండగానే ఆ ఎన్నికలు తెచ్చిన చిక్కులు కూడా చుట్టుకుంటూనే ఉన్నాయి. ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపు కోసం వెనుక శక్తులుగా పనిచేసింది విష్ణు తండ్రి మోహన్ బాబు, మరో నటుడు నరేష్. ఇదే క్రమంలో మోహన్ బాబు ఊహించని చిక్కుల్లో పడ్డారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని.. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల పెంపకం దారుల సంఘం మహబూబాబాద్ జిల్లా తోర్రూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Akshay Kumar: అక్కీ ఏం చేసినా ట్రెండే.. బయోపిక్స్‌కా బాద్ షా!
మా ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలపై స్పందించిన మోహన్ బాబు తమ మనోభావాలను దెబ్బ తినేలా మాట్లాడారని.. ఈ నేపథ్యంలోనే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆ సంఘం నేతలు చెప్పారు. ఎన్నికలో జరిగిన గొడవలపై మాట్లాడిన మోహన్ బాబు.. ఎన్నికల్లో ఈ గొడవలేంటి..? ఏంటి ఈ భీబత్సం, నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్.. ఈరోజుల్లో గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా ఫోన్ ఉంది. అందరు చూస్తున్నారు మనల్ని’ అని వ్యాఖ్యానించారు.
Rashi Khanna: రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. ఫోటోలు వైరల్!
దీనిపై ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల పెంపకం దారుల సంఘం గొర్రెలు, మేకలు పెంచే వారు చూస్తే మీ గౌరవం దెబ్బ తింటుందా? మేము చూస్తే సినీతారల గౌరవం దిగజారిపోతుందా? అని ప్రశ్నించారు. మా వృత్తిని కించపరిచేలా మాట్లాడిన మోహన్ బాబు గారిపై చర్యలు తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఫిర్యాదు చేసింది. ఒక్క తోర్రూరులో మాత్రమే కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పీఎస్ లో కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది.