Rashi Khanna: రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. ఫోటోలు వైరల్!

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ బోలెడు అవకాశాలు రావాలంటే బోల్డ్ గా ఉండాలి. లేకపోతే ఇప్పుడొస్తున్న కొత్త హీరోయిన్లతో పోటీ పడలేం. ఇదీ ఇప్పటికే ఇక్కడ తిష్టవేసిన భామల మాట.

Rashi Khanna: రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. ఫోటోలు వైరల్!

Rashi Khanna (image:instagram)

Rashi Khanna: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ బోలెడు అవకాశాలు రావాలంటే బోల్డ్ గా ఉండాలి. లేకపోతే ఇప్పుడొస్తున్న కొత్త హీరోయిన్లతో పోటీ పడలేం. ఇదీ ఇప్పటికే ఇక్కడ తిష్టవేసిన భామల మాట. ఢిల్లీ బేబీ రాశిఖన్నా అప్పుడు కాస్త చబ్బీగా చూసేందుకు ముద్దుగా ఉండేది. కానీ, ఇది అవకాశాలు తెచ్చేందుకు ఉపయోగపడలేదేమో కష స్లిమ్ గా మారి క్యూట్ నుండి హాట్ గా మారింది. మారిన తనను తాను డ్రెస్సింగ్ అద్దంలో చూసుకుంటే ఏమొస్తుంది.. ప్రపంచానికి చూపిస్తే కదా తెలిసేది అనుకుందేమో నెట్టింట దుకాణం పెట్టేసింది.

Romantic: నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్.. రొమాంటిక్ ట్రైలర్ అదిరిందంతే!

సహజంగానే సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే రాశి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంది. అలానే ఈరోజు కూడా బిహైండ్ ది సీన్ అంటూ కొన్ని ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇందులో రాశి గతంలో లేనంతగా హాట్ అవతారంలో కనిపించింది. దీంతో ఇప్పుడు ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Liger: బాంబే బ్యూటీకి రౌడీహీరో ఫిదా.. అద్భుతమంటూ ప్రశంసల వర్షం!

ఇక, రాసి సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’లో నటిస్తున్న రాశి మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్ లో రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌ చేస్తోంది.