Shehzada: అల వైకుంఠపురములో రీమేక్ మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే!

అల వైకుంఠపురములో హిందీ రీమేక్ మూవీ ‘షెహజాదా’ నేటి అర్ధరాత్రి నుండి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Shehzada: అల వైకుంఠపురములో రీమేక్ మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే!

Shehzada Movie Locks OTT Release Date

Updated On : April 13, 2023 / 9:16 PM IST

Shehzada: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించగా, అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Shehzada: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంటు.. భలే ఉన్నాడుగా!

ఇక ఈ సినిమాను రీసెంట్‌గా బాలీవుడ్‌లో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్‌లో రీమేక్ చేశారు. ‘షెహజాదా’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ, ఈ సినిమా రిలీజ్ సమయానికి అంతగా బజ్ లేకపోవడంతో, ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. దీంతో ఈ సినిమా ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. అందాల భామ కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Bollywood Star Hero : రిలీజ్ రోజే టికెట్ కొంటే టికెట్ ఆఫర్.. కారణం అదేనా?

కాగా, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ అర్ధరాత్రి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. థియేటర్స్‌లో ఈ సినిమాను చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.