నీవి రియలా.. ఫేకా.. ముట్టుకోవచ్చా? అని అడిగాడు..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 08:17 PM IST
నీవి రియలా.. ఫేకా.. ముట్టుకోవచ్చా? అని అడిగాడు..

Updated On : September 24, 2020 / 8:26 PM IST

Sherlyn Chopra Casting Couch: ఓ వైపు డ్రగ్స్ వ్యవహారం మరోవైపు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సినీ ఇండస్ట్రీలో ఆవేదన నెలకొంది. నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ (KWAN Talent Agency) అధినేతపై సంచలన ఆరోపణలు చేసింది. క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ సహ భాగస్వామి అనిర్భన్ తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది.

‘ఓసారి సినిమా అవకాశాల కోసం అనిర్భన్‌ను కలిశాను. అతను నన్ను పై నుంచి కింద వరకు చూశాడు. ‘ఏమైంది సర్.. నా డ్రెస్ బాగోలేదా? అని అడిగాను. ‘కాదు.. నీ వక్షోజాలు నిజమైనవేనా? వాటిని ముట్టుకోవచ్చా’ అని అడిగాడు. నేను షాకయ్యాను. ‘సార్ మీకు పెళ్లైయింది కదా.. మీ భార్యని ముట్టుకోలేదా.. ముట్టుకుంటే తెలిసేది కదా రియలా, ఫేకా’ అని చెప్పాను. ‘అవి నిజమైనవో, కావో అతనికేంటి సమస్య? ఓ మహిళతో అలా మాట్లాడకూడదు కదా’ అంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొంది షెర్లిన్ చోప్రా.