Shine Tom Chacko engaged with his girlfriend Thanuja
Shine Tom Chacko : మలయాళ స్టార్ నటుడు ‘షైన్ టామ్ చాకో’.. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. నాని ‘దసరా’, నాగశౌర్య ‘రంగబలి’ సినిమాల్లో నటించిన షైన్ టామ్.. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’లో నటిస్తున్నారు. ఇక ప్రొఫిషనల్ లైఫ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న షైన్ టామ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని కూడా కొంచెం అందంగా మార్చుకుంటున్నారు.
ప్రముఖ మోడల్ తనూజ, షైన్ టామ్ చాకో చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇన్నాళ్లు ప్రేమ జర్నీని ఎంజాయ్ చేసిన వీరిద్దరూ.. ఇప్పుడు పెళ్లి లైఫ్ ని మొదలుపెట్టబోతున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం వేడుక జరిగింది. కేవలం దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలోనే షైన్, తనూజ నిశ్చితార్థం చాలా సాదాసీదాగా జరిగింది.
Also read : Guntur Kaaram : ట్రెండ్ సెట్టర్ మహేష్ బాబు.. మొట్టమొదటిసారి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షైన్ టామ్ చాకో, తనూజ తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ వారికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే వివాహం జరగనుందట. త్వరలోనే పెళ్లి డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు. కాగా షైన్ టామ్ చాకో ఇది రెండో వివాహం.
కాగా షైన్ టామ్ చాకో దఅసోసియేట్ డైరెక్టర్ గా మొదలయ్యి.. ఆ తర్వాత యాక్టింగ్ లో ఫుల్ యాక్టివ్ గా మారారు. ఇప్పుడు మలయాలతో పాటు సౌత్ లోని పలు భాషల్లో నటిస్తూ అలరిస్తూ వస్తున్నారు. తెలుగులో ‘దసరా’ సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న షైన్ టామ్.. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్నదని సమాచారం.