Kushi Movie: ఖుషి అనే టైటిల్ అందుకే పెట్టానంటోన్న డైరెక్టర్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టాడో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.

Kushi Movie: ఖుషి అనే టైటిల్ అందుకే పెట్టానంటోన్న డైరెక్టర్

Shiva Nirwana About Keeping Kushi Movie Title

Updated On : April 9, 2023 / 5:17 PM IST

Kushi Movie: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Kushi Movie: విజయ్ సమంతల మధ్యలో మరో హీరోయిన్.. నిజమేనా?

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను కశ్మీర్, చెన్నలో షూటింగ్ చేశారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు శివ నిర్వాణ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే, ఇందులో విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నాడట. ఇక ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఆయన అన్నారు. అయితే ఈ సినిమాకు అసలు ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టాడనే విషయాన్ని రివీల్ చేశాడు.

Kushi 2023 : రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఖుషీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’లోని ఎమోషన్స్ తనను ఎంతగానే ఆకట్టకుందని.. ఇక ఈ సినిమాలోనూ అదే తరహా ఎమోషన్స్ ఉండనుండటంతో ఈ సినిమాకు ‘ఖుషి’ తప్ప వేరొక టైటిల్ తాను ఊహించలేకపోయానని శివ నిర్వాణ తెలిపాడు. మరి ఈ సినిమాలో విజయ్-సమంతల కెమిస్ట్రీ ఎలా ఉండోతుందా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది.