Shiva Shankar
Shiva Shankar Master Funeral : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు 2021, నవంబర్ 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్నాయి. హైదరాబాద్ మహా ప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి పంచవటి కాలనీలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని ఉంచారు. దీంతో ఆయనకు సినీ లోకం నివాళులు అర్పిస్తోంది. ఇటు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శివశంకర్ భార్య హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
Read More : Deeksha Divas : కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో…
శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళం సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. నటుడిగా కూడా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చిన ఆలయ్ చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్ మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. బుల్లితెర పైనా తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్ డ్యాన్స్ మాస్టర్లుగా కొనసాగుతున్నారు.
Read More : Shivashankar Master : వెన్నెముక విరిగి ఎనిమిదేళ్లు మంచం పైనే.. తర్వాత 800 సినిమాలకి కొరియోగ్రఫీ
తెలుగులో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రంలోని ధీర ధీర పాటకుగానూ.. 2011లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు శివశంకర్ మాస్టర్. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. బుల్లితెరపై ఆట, జూనియర్స్, ఢీ వంటి కార్యక్రమాలకు జడ్జ్‌గా వ్యవహరించి యువ డ్యాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు.
Read More : Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత
శివశంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్దలతో పాటు, నటీ నటులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. శివ శంకర్ మాస్టర్ మరణ వార్త తనను కలచి వేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పని చేశారని తెలిపారు. శివశంకర్ మాస్టర్ తాను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశామని గుర్తు చేసుకున్నారు. మాస్టర్ మృతితో ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తుందని భావోద్వేగం వ్యక్తం చేశారు.