Shivakarthik
Shivakarthik : ఇటీవల ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన శంబాలా సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆదికి కంబ్యాక్ మాత్రమే కాకుండా సినిమాలో నటించిన చాలా మందికి పేరు తెచ్చింది. ఈ సినిమాలో నటుడు శివకార్తీక్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాతో విలన్ గా శివకార్తీక్ కి కూడా మంచి పేరొచ్చింది. శంబాలా సక్సెస్ తర్వాత నటుడు శివకార్తీక్ మీడియాతో మాట్లాడుతూ తన సినిమా జర్నీ గురించి చెప్పుకొచ్చాడు.(Shivakarthik)
శివకార్తీక్ తన సినిమా ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. మాది వ్యవసాయ కుటుంబం. గుంటూరు జిల్లాలోని వరగాని ఊరు మాది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చాను. జోష్ సినిమాకు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. అక్కడ్నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నాను అని తెలిపాడు.
Also Read : Purushaha Song : మగాడి మీద జాలి పడేదెవ్వడు.. కీరవాణి పాడిన ఈ సాంగ్ విన్నారా?
శివకార్తీక్ హీరోగా చేయటంపై స్పందిస్తూ.. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలో హీరోగా లజ్జ సినిమా చేశాను. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాను. అది హిట్ అవ్వక ఈ గ్యాప్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయక గ్యాప్ రావడంతో చేతిలో సినిమాలు లేక కష్టాలు చూసాను. అలాంటి టైములో పంతం సినిమా ఛాన్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను అని తెలిపారు.
ఆర్జీవీ భైరవగీత సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేయడంతో అది చూసి బోయపాటి గారు అఖండలో అవకాశం ఇచ్చారు. అక్కడ్నుంచి నాకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేశాను. అయితే ఎప్పుడూ ఒకేలా ఉండే పాత్రలు చేయకూడదు అనుకునే సమయంలో ఆడిషన్ ఇచ్చి శంబాల సినిమాలో సెలెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ యుగంధర్ మునికి నేను రుణపడి ఉంటాను అని తెలిపారు.
Also Read : Divi Vadthya : నేను కత్తిలా ఉంటా నాకు కూడా అవకాశం ఇవ్వండి.. అలాంటి బట్టలు అక్కడి వరకే.. దివి కామెంట్స్..
తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్తూ.. హైందవ, వృషకర్మ సినిమాలు చేస్తున్నాను. శివపుత్రుడు సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర లాంటిది చేయాలనేది నా కల అని తెలిపాడు శివకార్తీక్.