Divi Vadthya : నేను కత్తిలా ఉంటా నాకు కూడా అవకాశం ఇవ్వండి.. అలాంటి బట్టలు అక్కడి వరకే.. దివి కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను పెట్టె పోస్టుల గురించి, వుమెన్ డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ చేసింది దివి.(Divi Vadthya)
Divi Vadthya
Divi Vadthya : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది దివి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను పెట్టె పోస్టుల గురించి, వుమెన్ డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ చేసింది.(Divi Vadthya)
సోషల్ మీడియాలో తను పెట్టే పోస్టుల గురించి స్పందిస్తూ.. నాకు ట్రెడిషినల్ గా ఉండటం చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న సినిమాల్లో ఇలాగే చూపిస్తున్నారు. నేను కూడా బాగుంటాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా కత్తిలా ఉంటాను అని చూపించుకోడానికి సోషల్ మీడియానే ప్లాట్ ఫామ్. నేను అక్కడే నా బాడీ, నా స్కిల్స్, నా ఫోటోలు చూపెడతాను. ఇక్కడ సినిమా వాళ్లకు ఫస్ట్ లుక్స్ ఇంపార్టెంట్, ఆ తర్వాతే యాక్టింగ్ వచ్చారాదా అని చూస్తున్నారు. యాక్టింగ్ ఇంపార్టెంట్ కానీ మనవాళ్ళు అది చూడట్లేదు. లుక్స్ చూస్తున్నారు. అందుకే నేను అలా ఫోటోలు పోస్ట్ చేస్తున్నాను. అయినా ఆ బట్టలు ఫోటోల వరకే బయట అవి వేసుకొని తిరగను అని తెలిపింది.
అలాగే ఇటీవల వుమెన్ డ్రెస్సింగ్ గురించి జరిగిన ఇష్యూ పై స్పందిస్తూ.. అతను(శివాజీ) చెప్పింది కరెక్ట్ అవ్వొచ్చు కానీ లూజ్ టాంగ్ ఉండకూడదు. మనం వేసే బట్టలు పేరెంట్స్ కి అగ్లీ గా ఉండకూడదు. మనం డ్రెస్ సరిచేసుకుంటూ ఉంటే వాళ్ళు చూస్తుంటే అన్ కంఫర్ట్ ఫీల్ అవడం ఎందుకు. కానీ సెక్సీగా రెడీ అవ్వండి, సూపర్ గా రెడీ అవ్వండి. నీకు ఏది నచ్చితే అది వేసుకో అది పక్కనోళ్ళకు ఇబ్బంది కలగనంతవరకు. జనాలు నిన్ను అగ్లీగా చూసేంతలా వేసుకోకు. నేను సోషల్ మీడియాలో కేవలం ఫోటోల కోసం మాత్రమే వేసుకుంటాను. అవి బయటకు వేసుకొని వెళ్ళను. నీకు కావాల్సినవి వేసుకో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు కానీ వేరేవాళ్లకు ఇబ్బంది కలగకూడదు. ఎక్కడికి వేసుకెళ్ళేవి అక్కడికి వేసుకెళ్ళాలి. టెంపుల్, బీచ్, పబ్.. ప్లేస్ ని బట్టి బట్టలు వేసుకోవాలి అని చెప్పుకొచ్చింది దివి.
