Tollywood Stars : బాలయ్య ఉంటే నాగ్ ఉండడు.. నాగ్ ఉంటే బాలయ్య ఉండడు.. ప్రతిసారి ఏంటి ఇది..? సీనియర్ హీరోల ఫోటో వైరల్..

ఒకవేళ సీనియర్ హీరోలు కలిసినా నాగార్జున లేదా బాలయ్య ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. (Tollywood Stars)

Tollywood Stars : బాలయ్య ఉంటే నాగ్ ఉండడు.. నాగ్ ఉంటే బాలయ్య ఉండడు.. ప్రతిసారి ఏంటి ఇది..? సీనియర్ హీరోల ఫోటో వైరల్..

Tollywood Stars

Updated On : January 25, 2026 / 4:07 PM IST

టాలీవుడ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో
బాలకృష్ణ మిస్సింగ్
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఫోటో వైరల్

Tollywood Stars : మన హీరోలు కలిసి కనిపిస్తే ఆ ఆనందమే వేరు. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ.. కలిసి కనిపిస్తే మాములుగా ఉండదు. ఈ నలుగురు కలిసి అప్పుడెప్పుడో వజ్రోత్సవం, టాలీవుడ్ క్రికెట్ మ్యాచుల్లో కనపడ్డారు. మళ్ళీ ఇప్పటివరకు నలుగురు కలిసి కనపడలేదు.(Tollywood Stars)

ఒకవేళ సీనియర్ హీరోలు కలిసినా నాగార్జున లేదా బాలయ్య ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. తాజాగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కలిసి వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి ఈ ముగ్గురితో కలిసి ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Also See : Bigg Boss Soniya : కూతురు బారసాల ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ సోనియా..

అయితే ఇటీవల సీనియర్ హీరోలు కలిసిన ప్రతిసారి బాలకృష్ణ ఉంటే నాగార్జున మిస్ అవుతున్నారు. నాగార్జున ఉంటే బాలకృష్ణ మిస్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం బాలయ్య 50 సంవత్సరాల నట ప్రస్థానం ఈవెంట్లో కూడా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వచ్చారు కానీ నాగార్జున రాలేదు. అంతకుముందు కూడా ఓ ఈవెంట్లో చిరు, నాగ్, వెంకటేష్ కలిసి కనపడ్డారు కానీ బాలయ్య మిస్ అయ్యారు.

Tollywood Stars Chiranjeevi Nagarjuna Venkatesh in one Frame Balakrishna Missing

దీంతో ఈ సీనియర్ హీరోల మీటింగ్ చర్చగా మారుతుంది. ఎప్పుడు చూసిన ముగ్గురు హీరోలే కనిపిస్తున్నారు, నలుగురు కలిసి ఎప్పుడు కనిపిస్తారు? బాలయ్య ఉంటే నాగార్జున ఉండట్లేదు? నాగార్జున ఉంటే బాలయ్య ఉండట్లేదు? అనుకోకుండా ఇలా జరుగుతుందా? లేక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కలిసి కనిపిస్తున్నారు కానీ నలుగురు కలిసి కనిపిస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్, సినిమా లవర్స్. మరి అది ఎప్పుడు జరుగుతుందో, బాలయ్య నాగార్జున కలిసి చిరు వెంకీలతో ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.

Also Read : Nithiin : ఎల్లమ్మ పోయింది.. కొత్త సినిమా వచ్చింది.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా.. ఈసారైనా హిట్ కొడతాడా?