మెగాస్టార్ చిరంజీవి మృతి అంటూ ప్రముఖ రచయిత్రి ట్వీట్, భగ్గుమన్న ఫ్యాన్స్
కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) గుండెపోటుతో ఆదివారం(జూన్ 7,2020) చనిపోయిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు,

కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) గుండెపోటుతో ఆదివారం(జూన్ 7,2020) చనిపోయిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు,
కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) గుండెపోటుతో ఆదివారం(జూన్ 7,2020) చనిపోయిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియాలో చిరంజీవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం అని వాపోయారు. చిరంజీవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రముఖ రచయిత్రి శోభా డే కూడా ట్విట్టర్‌లో చిరంజీవి మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘మరో దిగ్గజ నటుడిని కోల్పోయాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి..” అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ఆమె ఓ పెద్ద పొరపాటు చేశారు. కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఫొటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫొటోను పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు శోభా డే.
మరీ ఇంత దారుణమా?
శోభా డే ట్వీట్ చూసి మెగా అభిమానులు షాక్ అయ్యారు. వారికి తీవ్రమైన కోపం తెప్పించింది. ఆమెపై మండిపడ్డారు. మరీ ఇంత దారుణమా? ఇంత నిర్లక్ష్యమా? అని ఫైర్ అయ్యారు. చనిపోయింది ఎవరో కూడా తెలుసుకోకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎవరి ఫొటో పడితే వారి ఫోటో పెట్టి అలా ఎలా ట్వీట్ చేస్తారని సీరియస్ అయ్యారు. తమ హీరోపై తప్పుడు పోస్టు పెట్టినందుకు ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. శోభాడే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. “ప్రియమైన బాలీవుడ్ సెలబ్రిటీలారా.. మీకు మా నటీనటుల గురించి తెలీకపోతే ట్వీట్ చేయకండి.. అంతేకానీ మీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించకండి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అరే శోభా మేడమ్, రెండు పెగ్గులు మద్యం తాగి ట్వీట్లు చేయద్దు.. అని మరో నెటిజన్ ఘాటుగా ట్రోల్ చేశాడు.
తప్పు తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేసిన శోభా డే:
కాగా, తన తప్పు తెలుసుకున్న శోభా డే ఆ ట్వీట్‌ను తొలగించారు. పొరపాటున మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టానని గ్రహించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్వీట్ వైరల్ కావడం, మెగా అభిమానులు రచ్చ చేయడం జరిగిపోయాయి. అందుకే, తొందరపడి ఏ పనీ చేయకూడదు అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే, ఇదిలో ఇలా అడ్డంగా బుక్కవ్వాల్సి వస్తుంది.
Dear Bollywood Celebrities/WHATEVER, if you don’t know our actors, then please don’t tweet. Simple!!!!!!!
A simple Google search goes a long way in covering your stupidity.
— Vamsi Kaka (@vamsikaka) June 7, 2020
Read: ప్రభాస్ గెస్ట్ హౌస్ పై కూకట్ పల్లి కోర్టులో నేడు ట్రయల్