వారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌.. కేసు పెడతాను..

  • Published By: sekhar ,Published On : July 28, 2020 / 02:10 PM IST
వారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌.. కేసు పెడతాను..

Updated On : July 28, 2020 / 2:56 PM IST

హీరోయిన్ శ్ర‌ద్ధా దాస్ బిగ్‌బాస్ 4 కార‌ణంగా తాను కోర్టుకు వెళ‌తాన‌ని అంటున్నారు. ఇంత‌కూ బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు, శ్ర‌ద్ధా దాస్‌కు ఏమైనా గొడ‌వా? అంటే అదీ కాదు. అస‌లు విష‌య‌మేమంటే.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగవ సీజన్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అప్పటినుండి బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్ వీరే అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌డం ప్రారంభ‌మయ్యాయి. ఇందులో శ్ర‌ద్ధా దాస్ పాల్గొంటారు అంటూ వార్త‌లు రావడంతో.. ఆమె ఆ వార్త‌లను‌ ఖండించారు. అయినా పుకార్లు ఆగ‌లేదు. దీంతో శ్ర‌ద్ధా దాస్ ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

‘‘బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను చూసి చాలా మంది నన్ను అడుగుతున్నారు. జ‌ర్న‌లిస్టులు ఇలాంటి వార్త‌లు రాసేముందు క్లారిటీ తీసుకుంటే బావుంటుంది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. అస‌త్య‌పు వార్త‌లు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకోడానికి వెనుకాడబోను’’ అన్నారు శ్ర‌ద్ధా దాస్‌. మ‌రిప్పుడైనా శ్ర‌ద్ధాపై అస‌త్య‌పు వార్త‌లు ఆగుతాయేమో చూడాలి. తెలుగులో ‘నిరీక్షణ’ అనే థ్రిల్లర్ సినిమా చేస్తుంది శ్రద్ధా దాస్..