Stree 2 : హమ్మయ్య బాలీవుడ్ మళ్ళీ హిట్ కొట్టింది.. కలెక్షన్స్‌తో అదరగొడుతున్న స్త్రీ 2..

ఈ సంవత్సరం మొదటి నుంచి సాలిడ్ హిట్ లేక వెయిట్ చేస్తున్న బాలీవుడ్ కి హిట్ ఇచ్చిన స్త్రీ 2 ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Shraddha Kapoor Stree 2 Movie Creates New Records in Collections at Bollywood Box Office

Stree 2 : లాస్ట్ ఇయర్ కొన్ని బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము రేపిన బాలీవుడ్ ఈ సంవత్సరం ఆ రేంజ్ హిట్స్ కొట్టలేకపోయింది. సో కాల్డ్ స్టార్ హీరోలందరూ ఫ్లాప్ అవుతున్న ఈ టైమ్ లో బాలీవుడ్ కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది స్త్రీ 2. బాలీవుడ్ మాత్రమే కాదు ప్రస్తుతం ఇండియా మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటోంది. ఈ సంవత్సరం మొదటి నుంచి సాలిడ్ హిట్ లేక వెయిట్ చేస్తున్న బాలీవుడ్ కి హిట్ ఇచ్చిన స్త్రీ 2 ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఆగస్ట్ 15న థియేటర్లోకొచ్చిన ఈ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ అంచనాల్ని మించి సూపర్ హిట్ అయ్యి 300 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్స్ లో 2018లో వచ్చిన హార్రర్ మూవీ స్త్రీ మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2 సేమ్ స్టార్ కాస్ట్ తో పాటు తమన్నా స్పెషల్ సాంగ్ తో రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : Allu Arjun – Pushpa 2 : ‘పుష్ప 2’ అయ్యేదాకా వేరే సినిమా గురించి మాట్లాడేదేలే.. హీరోలంతా అలా.. బన్నీ ఇలా..

బాలీవుడ్ లో ఈ సంవత్సరం హృతిక్ ఫైటర్ మూవీ జస్ట్ 337 కోట్లతో సరిపెట్టుకుంటే స్త్రీ 2 సినిమా 300 కోట్లు దాటి 400 కోట్ల వైపు దూసుకెళ్తుంది. 2023 బాలీవుడ్ చాలా కాలం తర్వాత కమ్ బ్యాక్ అయిన ఇయర్. షారూఖ్ ఖాన్ బ్యాక్ టూ బ్యాక్ వెయ్యికోట్ల హిట్లతో బాలీవుడ్ ని సెట్ చేశాడనుకున్నారు. ఈ సంవత్సరం హృతిక్ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడనుకున్నారు. హృతిక్ ఫైటర్ పర్వాలేదనిపించింది కానీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అక్షయ్ కుమార్ బడేమియా చోటేమియా డిజాస్టర్, సర్ ఫిరా మొన్నీమధ్య వచ్చిన ఖేల్ ఖేల్ మే సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. వీటితో పాటు చందూ చాంపియన్, బ్యాడ్ న్యూజ్, క్రూ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ హిట్ ని అందుకోలేకపోయాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ కరువు తీరేలా స్త్రీ 2 రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కచ్చితంగా 500 కోట్ల లిస్ట్ లో స్త్రీ 2 ఉంటుందని బాలీవుడ్ ఫిక్స్ అయింది.

ట్రెండింగ్ వార్తలు